Athiya Shetty: క్రికెటర్‌తో లింక్.. నటిని ఇరికించిన నిర్మాత
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/70905537/photo-70905537.jpg)
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె ఆథియా శెట్టి.. కేఎల్ రాహుల్‌కి మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత విక్రమ్ ఫడ్నిస్.. ఆథియాను ఆటపట్టించాలనుకున్నారు. ఆథియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మీ జీవితంలోని టైమింగ్‌ను నమ్మండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై విక్రమ్ కామెంట్ చేస్తూ.. ‘ఆథియా.. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా హైపర్ అయిపోతున్నావ్. కేఎల్ వద్దకు వెళ్దామా. అదే.. కౌలాలంపూర్’ అని పరోక్షంగా రాహుల్ గురించి కామెంట్ చేశారు. దాంతో ఆథియాకు ఒళ్లుమండింది. ‘నిన్ను బ్లాక్ చేయాల్సిన సమయం వచ్చింది’ అని సమాధానం ఇచ్చారు. విక్రమ్ అక్కడితో ఆగలేదు. ‘నేను అంపైర్‌కు ఫిర్యాదు చేస్తాను. నీ వికెట్ పడిపోయాక పెవిలియన్‌కు చేరుకోవాల్సిందే’ అంటూ ఆటపట్టించారు. తనపై వస్తున్న వదంతులపై రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను న్యూస్ పేపర్సే చదవను. కాబట్టి నా గురించి ఎవరేం రాస్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్‌గానే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉంది. ఒకవేళ నేను ప్రేమలో ఉంటే ముందుగా మీకే చెప్తాను’ అన్నారు.
By August 30, 2019 at 12:15PM
No comments