Ram Gopal Varma: వర్మ కులపిచ్చి.. ప్రభాస్‌ది నా కులమే అంటూ సంచలన వీడియో


వార్నీ కులపిచ్చి తగలెయ్యా.. అని ప్రేక్షకులు తిట్టుకునే ప్రోమో వదిలిపెట్టారు వివాదాల దర్శకుడు . సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎంత దిగజారడానికైనా రెండో ఆలోచన చేయని వర్మ.. తన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్ర ప్రమోషన్స్‌కి సాహో, ప్రభాస్‌లను సైతం వాడేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘క్యాస్ట్ ఫీలింగ్’ సాంగ్ ప్రోమోను వదిలిపెట్టారు. ‘నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.. అందుకు రెబల్ స్టార్ .. ‘సాహో’ చిత్రం కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకుంటే ప్రభాస్‌ది నా క్యాస్ట్ కాబట్టి. ఈ సందర్బంగా నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని ఒక పాటని 27 తారీఖు ఉదయం 9గం. 27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం’ అంటూ పిల్లలు భయపడే గొంతుతో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు వర్మ. సినిమాను ప్రమోట్ చేసుకోవాలంటే చేసుకో.. కాని ఇలా నీకు పట్టిన కులంగజ్జిని ప్రభాస్‌కి ఎందుకు పులుముతున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వివాదం చేయడం.. దానిద్వారా ప్రమోషన్స్ చేసుకోవడమే కదా.. వర్మకు తెలిసిన విద్య. సో.. ఇన్నాళ్లు గుర్తుకురాని వర్మ కులం.. సాహో సందర్భంగా గుర్తుకువచ్చిందన్న మాట.


By August 26, 2019 at 02:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varmas-caste-feeling-song-promo-from-kamma-rajyam-lo-kadapa-reddlu/articleshow/70839658.cms

No comments