Maharastra: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 8మంది దుర్మరణం
మహారాష్ట్రలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాంతంలోని సిర్పూర్ తాలూకా వాఘాడి గ్రామంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 8మందికి పైగా కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఫ్యాక్టరీలోని సిలిండర్లు వరుసగా పేలడంతో ఈ ఘటన సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం రాగానే పోలీసులు, రెస్క్యూ టీమ్స్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 100 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధాలు వినపడగానే కార్మికులు మంది బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 8మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, మృతుల సంఖ్య పెరిగే అకాశముందని సిర్పూర్ పోలీసులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో గాయపడిన కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పేలుడు కారణంగా వ్యాపించిన పొగ కారణంగా సమీప ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
By August 31, 2019 at 12:28PM
No comments