ఈ డ్రెస్‌లో వాణీ కపూర్ మతిపోగొట్టేస్తుందట
హీరోయిన్ అనగానే ముందుగా మనల్ని ఆకర్షించేది ఆమె ఫిగర్ ఆ తర్వాత దుస్తులు. ఈ విషయంలో మన భారతీయ నటీమణలు హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోరు. ఇక వర్కవుట్స్ చేసే నటీమణుల ఫిగర్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సెక్సీగా కనిపిస్తారు. ఇప్పుడు నటి గౌను ఒకటి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వార్’ సినిమాలో వాణి బ్లూ కలర్ గౌను ధరించే సన్నివేశం ఒకటి ఉంది. దానిని ఎలెక్టిక్ ఎల్లీ సాబ్ గౌను అంటారు. లెబనీస్‌కు చెందిన ఎల్లీ సాబ్ అనే ఐకానిక్ ఫ్యాషన్ డిజైనర్ ఈ గౌనును డిజైన్ చేశారు. ఈమె హాలీవుడ్ సెలెబ్రిటీస్ బియాన్సే, కేట్ మిడిల్టన్, నికోల్ కిడ్మన్, ఏంజిలినా జోలీ, ఎమీలియా క్లార్క్, కెండల్ జెన్నర్, టేలర్ స్విఫ్ట్‌లకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్‌నే బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్.. వాణీ కపూర్ కోసం తెప్పించారు. సినిమాలో ఈ గౌను ధరించే సన్నివేశం వాణీ కపూర్ ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమని అనైతా అంటున్నారు. ‘సినిమాలో వాణీ ఎల్లీ సాబ్ గౌను వేసుకుంటారు. ఆమెను సినిమాలో వీలైనంత సెక్సీగా చూపించాను. ఇందులో ఫ్యాషన్‌కు ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి పాత్రలో వాణి కనిపించనున్నారు. ఆమెను విభిన్న అవతారాల్లో చూస్తాం. ఆమె కోసం నేను చాలా మిక్సింగ్, మ్యాచింగ్ చేసి దుస్తులను ఎంపిక చేశాను’ అని తెలిపారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘వార్’ సినిమాను రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో గాంధీ జయంతి సందర్భంగా ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By August 31, 2019 at 12:24PM
No comments