Breaking News

ఇమ్రాన్‌ఖాన్ రెచ్చగొడుతున్నారు: ట్రంప్‌తో మోదీ


ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై పాకిస్థాన్ విషం కక్కుతున్న అంశాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లారు ప్రధాని మోదీ. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నారని, ఇది ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. సోమవారం ట్రంప్‌కు ఫోన్ చేసిన సుమారు అరగంట పాటు మాట్లాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాక భారత్-అమెరికా అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. రెండు రోజుల కిందట ట్రంప్‌ ఇమ్రాన్‌కు ఫోన్‌ చేసిన నేపథ్యంలో తాజాగా మోదీ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీర్ అంశంలో తాము కలగజేసుకోలేమని అమెరికా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశాన్ని భారత్‌తో కలిసి ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని ఇమ్రాన్‌ఖాన్‌కు సూచించారు. దీంతో భారత్‌ను అంతర్జాతీయంగా ఇరుకున పెడదామన్న పాక్ కుట్రకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ట్రంప్‌తో ఫోన్ సంభాషణలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి, ఉగ్రవాదుల విధ్వంసానికి తావులేని వాతావరణనాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించారు. జూన్‌లో ఒసాకాలో జరిగిన జి-20 సదస్సులో ట్రంప్‌తో సాగించిన చర్చలను కూడా ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల నేతల సంభాషణకు సంబంధించి పీఎంవో, వైట్‌హౌస్ వేర్వేరుగా ప్రకటనలు జారీచేశాయి.


By August 20, 2019 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/modi-talks-to-us-president-trump-on-phone-raises-pakistan-pm-imran-khans-provocative-remarks/articleshow/70748026.cms

No comments