వైరల్ వీడియో: వామ్మో సమంత.. ఏంటా ఫిట్‌నెస్.. జరజరా పాకేస్తోంది!
దక్షిణాది సినీ పరిశ్రమల్లోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆమెకున్న అభిమాన గణం అంతా ఇంతా కాదు. అక్కినేనివారి కోడలు అయిన తరవాత సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత మెరిగింది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, గ్లామర్ రోల్స్ చేసిన సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ‘రంగస్థలం’, ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ!’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు వీటికి ఉదాహరణలు. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో సమంత నటిస్తున్నారు. ఈ సినిమా తప్ప మరే చిత్రాన్ని సమంత అంగీకరించలేదు. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ పనిమీదే ఆమె చెన్నై వెళ్లారని కూడా అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. సమంత వెబ్ సిరీస్ రాబోతోందనే ఆనందం మాత్రం ఆమె అభిమానుల్లో ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా సమంత తన ఫిట్‌నెస్ వీడియో ఒకదానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో సమంతను చూస్తే ఆమె అభిమానులే కాదు ఎవరైనా షాక్ కావాల్సిందే. ప్రొఫెషనల్ అథ్లెట్ మాదిరిగా బార్స్‌ను రెండు చేతులతో పట్టుకొని జర జర పైకి పాకేస్తున్నారు. ఫిట్‌నెస్ ట్రైనర్ అభినవ్ పార్కౌర్ ఆధ్వర్యంలో సమంత ఈ ఫీట్లు చేశారు. అదొక్కటే కాదు రెండు రోజుల క్రితం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని వీడియోలు పెట్టారు. అవి కూడా ఫిట్‌నెస్‌కు సంబంధించినవే. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
By August 22, 2019 at 01:22PM
No comments