Breaking News

గుడికి వచ్చిన అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి.. పూజారి బాగోతం ఇలా బయటకొచ్చింది


మనసు ప్రశాంతంగా ఉండటం కోసం, కష్టాలను తొలగించాలని దైవాన్ని ప్రార్థించడం కోసం గుడికి వెళ్తుంటాం. ఆలయంలో కొలువైన అమ్మవారిని ఎంతగా నమ్ముతామో.. పూజారిని కూడా అంతే నమ్ముతాం. నిత్యం అమ్మవారిని ఉపాసించే పూజారి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తాడని ఊహించలేం కదూ. కానీ అర్చన చేసి, తీర్థ ప్రసాదాలు ఇచ్చే ఓ పూజారి.. పూజల ముసుగులో ఓ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రకాష్ నగర్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ప్రకాష్‌ నగర్‌లోని హరిహర క్షేత్రం పక్కన అమ్మవారి దేవాలయం ఉంది. ఆ ప్రాంతంలోని మహిళలు ఈ గుడికి ఎక్కువగా వెళ్తుంటారు. ప్రతి శుక్రవారం పూజలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. గత శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఈ గుడికి వెళ్లి హోమ గుండం వద్ద కూర్చున్నారు. కాసేపటికి అర్చకుడు కుప్పం బాలాజీ వారి దగ్గరకు వెళ్లాడు. మంత్రోపదేశం చేస్తానని చెప్పి చెల్లిని ఆలయం పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక.. నుదుటన బొట్టు పెట్టి, నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పూజారి వెంట వెళ్లిన తన సోదరి ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్క అక్కడకు వెళ్లి గది తలుపు తీసింది. పూజారి చేస్తున్న పని చూసి షాకైంది. మరేం మాట్లాడకుండా వెంటనే చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్లింది. పూజారి చేసి పనికి ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసింది. ఈ విషయాన్ని ఇంట్లో వెళ్లక చెప్పడానికి తొలుత అక్కాచెల్లెళ్లిద్దరూ తటపటాయించారు. కానీ ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు సోమవారం గుడికి వెళ్లి.. పూజారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసుకు అప్పగించారు. ఈ తతంగాన్ని వీడియో తీయగా.. ప్రస్తుతం దృశ్యాలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. ఈ పూజారి ఇంతకు ముందు కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పూజారికి కొందరు పెద్దల అండదండలు ఉన్నాయని, అందుకే ఇలాంటి పాడు పనులు చేసే సాహసం చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.


By August 22, 2019 at 01:22PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vijayawada-priest-allegedly-misbehaved-with-a-girl-beaten-up-by-locals/articleshow/70783956.cms

No comments