Breaking News

పోర్న్సైట్లో న్యూడ్ ఫోటోలు.. ఫ్రెండ్ చేసిన పనికి షాకైన యువతి


స్నేహం పేరుతో యువతిని నమ్మించిన యువకుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమె న్యూడ్ ఫోటోలు తీశాడు. చదువుకొనేందుకు అమెరికా వెళ్లి అక్కడ నుంచి వాటి పోర్న్ వెబ్‌సైట్లో పోస్టు చేశాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని మీర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ యువతి(24)కి స్కూల్ చదువుతున్న సమయంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మూడేళ్ల క్రితం వారిద్దరూ డిగ్రీ కలిసే చదవడంతో ఆ బంధం మరింత బలపడింది. తరుచూ ఫోన్లో మాట్లాడుకోవడం, సినిమాలకు, షికార్లు వెళ్లడం మొదలుపెట్టాడు. యువతిని ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న యువకుడు ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మాకర స్థితిలోకి చేరుకున్నాక కారులో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నగ్నం చేసి ఫోటోలు తీశాడు. ఆమె మెలకువ వచ్చిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయావంటూ నమ్మించి ఇంటి దగ్గర దించాడు. కొద్దిరోజుల తర్వాత తాను తీసిన ఫోటోలు, వీడియోలను బాధితురాలికి చూపించి వేధించాడు. వాటిని డిలీట్ చేయాలని యువతి వేడుకోవడంతో తొలగించినట్లు నాటకమాడాడు. కొద్దిరోజులు ఆమెతో బాగానే ఉండి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఆమె న్యూడ్ ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లో పెట్టాడు. వాటిని చూసిన బాధితురాలి ఫ్రెండ్స్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో షాకైన యువతి వెంటనే సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోర్న్ వెబ్‌సైట్లో తన ఫోటోలను తొలగించేలా చేయడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అమెరికా నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


By August 02, 2019 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-woman-complaint-against-her-friend-due-his-upload-nude-photos-in-online/articleshow/70493765.cms

No comments