కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/70904266/photo-70904266.jpg)
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో సతీష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన సతీష్ నగరంలోని మూసాపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తన స్నేహితుడు హేమంత్‌తో కలిసి ఐటీ స్లెట్ సొల్యూషన్స్ అనే కంపెనీని నడుపుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఆఫీస్‌కు వెళ్లిన సతీశ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య ప్రశాంతి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సతీశ్ స్నేహితుడైన హేమంత్‌పైనే తనకు అనుమానం ఉందని ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం హేమంత్ గదికి వెళ్లి చూడగా సతీశ్ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార లావాదేవీలే సతీశ్ హత్యకు దారి తీసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు వివాహేతర సంబంధమేదైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
By August 30, 2019 at 10:44AM
No comments