ఖుష్బూ మేడమ్.. రజనీకాంత్ ఎలా ఉంటారో తెలీదా
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/70904152/photo-70904152.jpg)
సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. ఆమె తలైవా రజనీకాంత్‌నే గుర్తుపట్టలేకపోయారు. అసలేం జరిగిందంటే.. తన స్నేహితురాలితో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడ ఓ షాపింగ్ సెంటర్‌కు వెళ్లగా.. మొబైల్ బ్యాక్ కవర్స్ కనిపించాయి. కవర్‌పై తమీమ్ బొమ్మ ఉంది. ఆ డిజైన్ కాస్త చూడటానికి రజనీకాంత్‌ను పోలి ఉంది. దాంతో వెంటనే ఖుష్బూ ఆ ఫోన్ బ్యాక్ కవర్ ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని దుకాణంలో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్‌స్టార్ రజనీకాంత్’ అని పేర్కొంటూ.. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్‌ను కూడా ట్యాగ్ చేసింది. కానీ ఫోన్ కవర్ వెనక ఉన్నది తలైవా కాదు. తమీమ్. అది గుర్తించిన నెటిజన్లు.. ఖుష్బూని ఓ ఆటాడుకున్నారు. ‘చెన్నైలో ఉంటూ తలైవా ఎలా ఉంటారో కూడా తెలీదా?’ అంటూ తిట్టిపోశారు. తప్పు గమనించిన ఖుష్బూ వెంటనే ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఓకే.. ఆయన మన రజనీకాంత్ కాదు. నన్ను సరిద్దిన స్నేహితులందరికీ ధన్యవాదాలు. తప్పుని ఒప్పుకుంటూ నేను, సరిదిద్దిన మీరు ఎదుగుతున్నాం. తప్పుల నుంచి నేర్చుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యురాలిగా వ్యవహరిస్తూనే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె చివరిగా పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించారు.
By August 30, 2019 at 10:44AM
No comments