విశాఖలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం


విశాఖ నగరంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. భూపేష్‌నగర్‌లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం పదేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా రాజేష్ అనే యువకుడు ఆమె నిర్మానుష్య ప్రాంతంలోకి ఎత్తుకుపోయి కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి కారులో పడేసి అత్యాచారానికి యత్నించాడు. కారు కదలికలను గమనించిన కొందరు చిన్నారులు, స్థానికులు అక్కడికెళ్లి అద్దాలపై గట్టిగా కొట్టడంతో రాజేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక పేరెంట్స్ స్థానిక మహిళా సంఘం నేతలను కలిసి వారి సాయంతో గురువారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం రెండు టీమ్‌లు గాలిస్తున్నాయని తెలిపారు.
By August 30, 2019 at 10:58AM
Post Comment
No comments