బండరాళ్లతో దాడి చేసి హత్య.. ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ దగ్గర దారుణం

ఖైరతాబాద్ సమీపంలో దారుణం జరిగింది. దగ్గర ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. శనివారం అర్ధరాత్రి ఘటన జరగ్గా.. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. మృతుడు నాగర్ కర్నూలకు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లికి చెందిన బంగారయ్యగా పోలీసులు గుర్తించారు. బంగారయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. హత్యకు దారి తీసిన కారణాలతో పాటూ.. అతడి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఘటన జరిగిన మెట్రో పిల్లర్ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుల్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
By August 18, 2019 at 11:45AM
No comments