Breaking News

యజమాని తెలివికి హ్యాట్సాఫ్.. ఇంటి దొంగను భలే పట్టేశాడు


ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు. అయితే ఆలోచన ఉండాలే కానీ ఎంత తెలివైన దొంగనైనా సులభంగా పట్టుకోవచ్చని హైదరాబాద్‌లోని ఓ ఇంటి యజమాని నిరూపించాడు. బీరువాలో దాస్తున్న సొమ్ము రోజూ కనిపించడకుండా పోతుండటంతో ఆ ఇంటి యజమాని సంపాదించిన సొమ్మును బీరువాలో దాస్తుంటాడు. అయితే తన సొమ్ములో కొంత మొత్తాన్న రోజూ ఎవరో దొంగిలిస్తున్నట్లు గుర్తించాడు. రోజూ డబ్బులు పెట్టడం తర్వాతి రోజుకు కొంత నగదు తగ్గడం జరుగుతూనే ఉంది. ఇది ఇంటి దొంగల పనే అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే అతడికి ఓ మెరుపు ఆలోచన వచ్చింది. దాన్ని అమల్లో పెట్టిన ఒక్కరోజులోనే దొంగను పట్టేశాడు. జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసిన ఈ దొంగతనం ఘటన వివరాలిలా ఉన్నాయి.. Also Read: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో భీంరెడ్డి పటేల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కొద్దిరోజులుగా భీంరెడ్డి బీరువాలో దాచుకున్న నగదు కొంచెం కొంచెం పోతోంది. అతడు ఎంత నిఘా పెట్టినా దొంగను పట్టుకోలేకపోయాడు. అప్పుడే అతడికి ఓ ఆలోచన వచ్చింది. రెండ్రోజుల క్రితం బీరువాలో రూ.2,100 నగదు పెట్టి ఆ నోట్ల నంబర్లన్నీ రాసుకున్నాడు. కొద్దిసేపటికే బీరువాలో డబ్బులు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో భీంరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడి ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించారు. ఎవ్వరూ కూడా తమకే పాపం తెలీదని చెప్పడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. ఆ వెంటనే భీంరెడ్డి తాను రాసుకున్న నోట్ల నంబర్లు చెప్పడంతో పోలీసులు పనివాళ్ల దగ్గర నోట్లను చెక్ చేశారు. పనిమనిషి ఉప్పరి అఖిల వద్ద ఎక్కువ నోట్లు ఉండటంతో ఆమెను ప్రశ్నించారు. అయితే ఆ నోట్లు తనవేనని ఆమె తొలుత బుకాయించినా.. భీంరెడ్డి చెప్పిన నోట్ల నంబర్లతో పోవడంతో అఖిలే దొంగ అని నిర్ధారించుకున్నారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. దీంతో అఖిలను అరెస్ట్ చేసి రూ.16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ తరలించినట్లు బంజారాహిల్స్‌ డీఐ రవికుమార్‌ తెలిపారు.


By August 23, 2019 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-house-owner-caught-thief-with-brilliant-idea/articleshow/70768535.cms

No comments