Breaking News

ఇంట్లోకి చొరబడి బాలికపై రేప్.. మరో గదిలో ఆమె చెల్లెలి నిర్బంధం


16ఏళ్ల బాలికపై కన్నేసిని మైనర్ బాలుడు ఆమె ఇంట్లోకే ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగింది. బాలికపై ఎప్పటి నుంచే కన్నేసిన బాలుడు ఇంట్లో ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. Also Read: చాంద్రాయణగుట్టకు చెందిన దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. మంగళవారం రాత్రి తల్లి, కొడుకు ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో ఆడపిల్లలిద్దరే ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన 16ఏళ్ల బాలుడు పెద్ద అమ్మాయిని గదిలోకి లాక్కెళ్లాడు. ఆమె చెల్లి కేకలు వేయగా ఆమెను మరో గదిలో బంధించాడు. అక్కపై అత్యాచారం చేసిన తర్వాత ఇంటి తలుపులు మూసేసి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి, కొడుకు విషయం తెలుసుకుని షాకయ్యారు. Also Read: బాధితురాలిని వెంటనే చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. పోలీసులు బాలుడిని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్ బాలుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:


By August 23, 2019 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-minor-boy-rapes-16-yr-old-girl-in-her-home/articleshow/70797257.cms

No comments