Breaking News

గత ఆరవైఏళ్లుగా ఓ రహస్యాన్ని దాచిపెట్టి పీఓకే ప్రజలను పాక్ మోసం చేస్తోందిలా!


పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రాజకీయ ఉద్దండులు, పాలకుల మధ్య కుదిరిన రహస్యం ఒప్పందం గురించి గత ఆరు దశాబ్దాలుగా గిల్గిత్-బాల్టిస్థాన్ సహా ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. 1949లో నాటి పాక్ పాలకులు రహస్యంగా ‘కరాచీ ఒప్పందం’కుదుర్చుకున్నారని పీఓకే, గిల్గిత్-బాల్టిస్థాన్‌కు చెందిన ప్రవాసంలో ఉన్న నేతలు దుయ్యబడుతున్నారు. పీఓకే వ్యవస్థాపక అధ్యక్షుడు సర్దార్ ఇబ్రహీం ఖాన్, జమ్మూ కశ్మీర్ ముస్లిం కన్ఫరెన్స్ చీఫ్ చౌధరి ఘులామ్ అబ్బాస్, ప్రభుత్వ ప్రతినిధి ముష్తాక్ గుర్నమీల సంతకాలను ఫోర్జరీ చేసి చీకటి ఒప్పందం రూపొందించి, గిల్గిత్-బాల్టిస్థాన్‌ను బలవంతంగా ఆక్రమించుకున్న విషయాన్ని యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రవాసంలో ఉన్న నసీర్ అజీజ్ ఖాన్ వెల్లడించారు. Read Also: ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఉన్న నసీర్ ఖాన్‌తో సహా ఆ పార్టీ అధినేత షౌకత్ కశ్మీరీ గురించి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అనేక ఏళ్లుగా వెదుకుతోంది. బల్టిస్థాన్‌లోని పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాక్ అనుమతితో బంగారు ఖనిజాల సహా సహజ వనరులను చైనా కంపెనీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. వారి ఆగడాలను నిలదీస్తున్నవారిని వేధించడం, అపహరించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు ప్రజలు తమ నివాస ప్రాంతం నుంచి వేరేచోటికి వెళ్లేందుకు కూడా తీవ్రవాద చట్టం కింద ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. పీఓకేలో ప్రజలు దుర్బర జీవితాన్ని గడుపుతున్నారని నసీర్ ఖాన్ వాపోయారు. దశాబ్దాలుగా ఉన్న కరాచీ చీకటి ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై ప్రస్తుతం గిల్గిత్-బాల్టిస్థాన్, పీఓకే వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, దీని వల్ల తమ భూభాగాన్ని వ్యూహాత్మకంగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. స్వతంత్ర కశ్మీర్‌గా చెప్పుకునే ప్రాంతంలో 90 శాతం భాగాన్ని పాక్ ఆక్రమించుకుందని, పాకిస్థాన్‌ చీకటి ఒప్పందంపై తాను ఎలాంటి సంతకం చేయలేదని పీఓకే వ్యవస్థాపక అధ్యక్షుడు సర్దార్ ఇబ్రహీం తమ నేతలతో చెప్పారని అన్నారు. పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ తండ్రి మహ్మద్ దీన్ తసీర్ ఇబ్రహీం వీరి సంతకాలను ఫోర్జరీ చేశాడని అన్నారు. Read Also: చీకటి ఒప్పందం ద్వారా మోసంతో తమ భూభాగాన్ని పాక్ దోచుకున్న విషయం దశాబ్దాలుగా ఏ ఒక్క కశ్మీరీకి తెలియదని నసీర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 28, 1949లో కరాచీ ఒప్పందంపై పాక్ మంత్రి ముష్తాక్ గుర్నమీ, పీఓకే అధ్యక్షుడు సర్దార్ ఇబ్రహీం, జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫెరెన్స్ చీఫ్ చౌధురి ఘులామ్ అబ్బాస్ సంతకాలు చేశారు. అయితే, ఈ చీకటి ఒప్పందం 1990 వరకు పాక్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. సంతకాలు చేసే సమయంలోనూ దీనిని మీడియాకు కూడా వెల్లడించలేదు. తొలిసారిగా 1990లో గిల్గిత్-బాల్టిస్థాన్ (జీబీ) తీర్పు సమయంలో పాక్ హైకోర్టు దీనిని వెల్లడించింది. అనంతరం 2008లో పీఓకే రాజ్యాంగంలో దీనిని అనుబంధంగా చేర్చారు. సింపుల్‌గా చెప్పాలంటే జీబీ ప్రజలు పాక్ ప్రభుత్వం చేతుల్లో 59 ఏళ్లుగా మోసపోతూ ఉన్నారు. తాజాగా, ఉప-ఖండంలో భారత్, పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో పాక్ తన బలగాలను పశ్చిమ సరిహద్దు నుంచి పీఓకేలోని తూర్పు ప్రాంతం ద్వారా వాయువ్య దిశగా తరలిస్తోందని నసీర్ ఖాన్ తెలిపారు. మరో భయంకరమైన యుద్ధానికి పాక్ సిద్ధమైందని, తమపై మళ్లీ రక్తపాతానికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఒడిగడుతోందని అక్కడ ప్రజలు భయపడుతున్నారని ఆయన అన్నారు. Read Also: జీబీలో మరో కీలక నేత షౌకత్ కశ్మీరీ, నసీర్ ‌ఖాన్‌లు గత రెండు దశాబ్దాలుగా ప్రవాసంలో ఉన్నారు. షౌకత్‌ను పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ 1994, 1999లో అపహరించి రావల్పిండి సమీపంలోని దాచిపెట్టింది... అమెరికా జోక్యంతో ఆఫ్గన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫంక్తుఖ్వా సమీపంలో ఆయన విడిచిపెట్టిందని నసీర్ వివరించారు. జీబీలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు ఐరాస సంస్థలతో కలిసి ఇరువురు గత రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తమ భూభాగం నుంచి పాక్ వైదొలగాలని ఉద్యమం చేపట్టారు.


By August 22, 2019 at 02:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pak-worst-kept-secret-cheated-people-of-pakistan-occupied-kashmir-for-six-decades/articleshow/70784933.cms

No comments