ప్రేమ పేరుతో బంగ్లా బాలికకు వల.. వ్యభిచారంలోకి దించి చిత్రహింసలు
బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికకు ప్రేమ వల వేసిన ఓ యువకుడు అమెను వ్యభిచార ముఠాకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ప్రేమలో పడింది మొదలు ఆ బాలికకు నిత్య నరకం చూపిస్తూ ప్రేమికుడితో పాటు విజయవాడకు చెందిన వ్యభిచార నిర్వాహకురాలు, హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ దంపతులు ఇలా అందరూ ఆమెను డబ్బు సంపాదించే యంత్రగానే చూశారు. ఆమె శరీరంతో రోజుకు వేలల్లో సంపాదిస్తూ పబ్బం గడుపుకున్నారు. బాలిక విషయం తెలుసుకున్న రాజకొండ పోలీసులు బాలికను రక్షించి వ్యభిచార రొంపిలో నుంచి విముక్తి కలిగించారు. Also Read: బెంగళూరుకు చెందిన సిగ్ధర్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడికి భాగ్యనగరంలోనే నివాసముంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన సొహైల్ హుస్సేన్, హోసన్ అనే దంపతుల ద్వారా ఓ బాలిక పరిచయమైంది. బంగ్లాదేశ్‌లో ఉండే ఆ బాలికతో సిగ్ధర్ తరుచూ ఫోన్లో మాట్లాడుతూ ప్రేమ వలలోకి దించాడు. తన దగ్గరికి వచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని చెప్పడంతో బాలిక ఎవరికీ చెప్పకుండా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చేసింది. Also Read: ఇక్కడికి రాగానే ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లి బార్లో డ్యాన్స్ గర్ల్‌గా మార్చేశాడు. విటులను తీసుకొచ్చి చేయించాడు. కొద్దిరోజుల తర్వాత విజయవాడకు చెందిన మహిళకు అమ్మేశాడు. ఆ మహిళతో బాలికతో వ్యభిచారం చేయించిన సొమ్ము చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న హుస్సేన్, హోసన్ దంపతులు బాలికను రప్పించి వారు కూడా వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించుకున్నారు. Also Read: బంగ్లాదేశ్ బాలిక హైదరాబాద్‌కు అక్రమ రవాణా అయినట్లు తెలుసుకున్న ప్రజ్వల ఎన్జీవో సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ 10రోజుల క్రితం ఈ విషయాన్ని రాచకొండ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు హైదరాబాద్‌లోని సెక్స్ రాకెట్‌పై 8రోజుల పాటు నిఘా పెట్టి పక్కా సమాచారంతో గురువారం వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. బాలికను రక్షించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
By August 23, 2019 at 07:50AM
No comments