యువతిని గర్భవతిని చేసిన హోంగార్డు.. పురిటినొప్పులతో మృతి

ప్రజలకు రక్షణ కల్పించే ఉద్యోగంలో ఉన్న హోంగార్డు కీచక అవతారమెత్తాడు. వివాహమై భార్యా బిడ్డలున్నా ప్రేమ పేరుతో మరో యువతికి మాయమాటలు చెప్పాడు. ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు పోయేలా చేశాడు. ఈ దారుణ కుమ్రం భీం జిల్లాలో ఆదివారం జరిగింది. Also Read: దాంపూర్‌కు చెందిన సజ్జన్‌లాల్ అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడికి కొన్ని నెలల క్రితం అరుణ అనే యువతి పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన సజ్జన్‌లాల్ సహజీవనం చేసి లైంగికంగా లోబరుచుకున్నాడు. దీంతో అరుణ గర్భవతి అయింది. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరినా మాయమాటలు చెబుతూ నెట్టుకొచ్చాడు. అరుణకు ఆదివారం పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఊర్లన్నీ తిప్పాడు. Also Read: పరిస్థితి విషమంచడంతో అరుణ మార్గమధ్యలోనే మృత శిశువుకు జన్మనిచ్చి తాను కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అరుణ మృతదేహాన్ని అసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అరుణ కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని విగతజీవిగా పడివున్న ఆమెను చూసి ఆవేదన చెందారు. సజ్జన్‌లాల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read:
By August 11, 2019 at 01:34PM
No comments