Babu Mohan: జగన్ పాలన మూడు పువ్వులు ఆరు కాయలు: బాబూ మోహన్
నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ సినిమాల్లో నటిస్తా.. చివరకి నా శవాన్ని కూడా యాక్టింగ్‌కి ఇస్తా అన్నారు ప్రముఖ కమెడియన్, బీజేపీ లీడర్ . ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా జీవితంపై ఆసక్తికరమైన విషయాలు తెలిపిన ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేతల పాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. Read Also: మోదీ పాలన భేష్.. దేశంకోసం ప్రధాని మోదీ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తీసుకునే ఒక్కో నిర్ణయం దేశ స్థితిగతులను మార్చుతోంది. నాయకుడు అంటే అలా ఉండాలి. బీజేపీలో తనది కార్యకర్త పాత్రే. Read Also: ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చేశా.. నాకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వక పోవడం వల్ల పార్టీ నుండి బయటకు రాలేదు. టిక్కెట్ అనేది నాకు ఆఫ్ట్రాల్. ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చేశా. నాకు ఎన్టీఆర్ నేర్పింది అదే. ఢిల్లీ నుండి ఆహ్వానం వచ్చింది అందుకే బీజేపీలో చేరా. డైనమిక్.. కేసీఆర్ పాలన కటిక చీకటి ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలను కటిక చీకటిలా ఉంది. ఏపీలో యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. బ్రహ్మాండమైన స్పీడ్‌లో డైనమిక్ లీడర్‌గా ముందుకు వెళ్తున్నాడు.
By August 23, 2019 at 10:34AM
No comments