Saaho Full Movie: రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లో ‘సాహో’.. బుద్ధి చూపించిన తమిళ్ రాకర్స్!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/70905683/photo-70905683.jpg)
ఇటీవల తెలుగులో వచ్చి విజయం సాధించిన మజిలీ, జెర్సీ సినిమాలను తమ వెబ్‌సైట్లో లీక్ చేశారు. ఇది ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. దీంతో ఇప్పుడు ‘మహర్షి’ సినిమా విషయంలోనూ కలెక్షన్లపై ప్రభావం చూపుతోందేమోనని నిర్మాతలు ఆందోళన పడుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు నిద్రపట్టకుండా చేస్తోంది తమిళ్ రాకర్స్. సినిమా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న ఈ వెబ్ సైట్‌ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ)ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన ‘మహర్షి’ని థియేటర్లో విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ ఆన్లైన్లో లీక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాహో మూవీని సైతం విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ లీక్ చేయడం గందరగోళానికి దారితీసింది. Also Read: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ లేటెస్ట్ మూవీ సాహో నేడు(ఆగస్టు 30న) తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది. బాహుబలి మూవీ అనంతరం ప్రభాస్ నటించిన మూవీ కావడం, హాలీవుడ్ రేంజ్ టేకింగ్స్‌తో భారీ బడ్జెట్ మూవీగా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అయితే మూవీ విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ తన బుద్ధి చూపించింది. హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసి మూవీ నిర్మాతలకు గట్టి షాకిచ్చింది. సాహో మూవీ సక్సెస్ కావాలని, యాక్షన్ సీన్లను ఎంజాయ్ చేయాలని కోరుతూ సినిమా విడుదలకు ముందే యూవీ క్రియేషన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పైరసీ లాంటివి గమనిస్తే తమకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలంటూ సాహో, వరల్డ్ సాహో డే అనే హ్యాట్ ట్యాగ్స్‌తో పోస్ట్ చేయడం గమనార్హం. కాగా, మహర్షి మూవీలో పాటు ఎన్టీఆర్ కథానాయకుడు, డియర్ కామ్రెడ్, వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ ఇలా ఎన్నో సినిమాలను తమిళ్ రాకర్స్ ఆన్లైన్లో లీక్ చేసి ఆ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.
By August 30, 2019 at 12:39PM
No comments