బిస్కట్ ఆశచూపి 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తెలంగాణలోని హన్మకొండలో రెండు నెలల క్రితం 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన మానవ మృగం ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించిన రోజే ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలో మరో ఘోరం జరిగింది. బిస్కట్లు ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో గురువారం మధ్యాహ్నం నాలుగేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటోంది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి బిస్కట్లు ఇస్తానని చెప్పి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. కాసేపటికి ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక జరిగిన దారుణాన్ని తండ్రి చెప్పింది. దీంతో వారు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి గురువారం సాయంత్ర గ్రామంలో పర్యటించి బాలిక పేరెంట్స్‌ను, స్థానికులను విచారించారు.
By August 09, 2019 at 07:36AM
No comments