Breaking News

కొత్త కారుకు పేరుపెట్టిన బన్నీ.. దీని ధర రూ.2.3 కోట్లు!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద బిఎండబ్ల్యూ, జాగ్వార్, పోర్షే, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన కోట్ల రూపాయలు విలువచేసే కార్లు ఉన్నాయి. ఇటీవలే సొంతంగా క్యారావ్యాన్‌ను కూడా కొనుగోలు చేశారు. సుమారు రూ.7 కోట్లతో ఈ రాయల్ వ్యానిటీ వ్యాన్‌ను కొన్నారు. దీనికి ‘ఫాల్కన్’ అని పేరుపెట్టారు. ఇలాంటి లగ్జరీ క్యారావ్యాన్ సొంతంగా టాలీవుడ్‌లో ఏ హీరోకి లేదు. ఇదిలా ఉంటే, తాజాగా బన్నీ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్‌ను బన్నీ కొనుగోలు చేశారు. దీని ధర సుమారు రూ.2.3 కోట్లు. ఈ కొత్తకారుకు బన్నీ పేరు కూడా పెట్టారు. కారుతో పాటు దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. Also Read: ‘‘ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దీనికి ‘బీస్ట్’ అని పేరు పెట్టాను. నేను ఎప్పుడు ఏది కొనుగోలు చేసినా.. నా మనసులో ఒకే ఒక్క విషయం ఉంటుంది. అదే కృతజ్ఞత’’ అని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, కారుపై కృతజ్ఞతతో బన్నీ దానికి ‘బీస్ట్’ అని పేరు పెట్టారన్న మాట. కాగా, ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో బన్నీ నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌. నివేతా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్‌, టబు, జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


By August 25, 2019 at 05:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-buys-a-new-range-rover-car-worth-rs-2-3-crore-calls-it-a-beast/articleshow/70828426.cms

No comments