Breaking News

విశాఖ మన్యంలో విషాదం.. వైద్యం కోసం 20 కి.మీ. నడిచిన గర్భిణీ, తల్లీబిడ్డ మృతి


విశాఖ మన్యంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం నిండు గర్భిణి కొండ ప్రాంతాల్లో 20 కి.మీ. నడవటంతో.. రక్తస్రావమైంది. దీంతో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం జమదంగిలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జమదంగికి చెందిన లక్ష్మీ అనే నిండు గర్భిణి వైద్యం కోసం జి.మాడుగుల మండంలోని బొయితిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. చికిత్స చేయించుకొని తిరుగు ప్రయాణమైంది. కొద్ది దూరం వచ్చాక పురిటి నొప్పులు రావడంతో డోలీలో ఆమెను ఇంటిని తీసుకెళ్లారు. తీవ్ర రక్త స్రావం కావడంతో.. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ప్రాణాలు విడిచింది. బిడ్డ కూడా చనిపోయింది. ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. వైద్య శాఖ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకూ స్పందించలేదు. మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలను తీసుకొస్తున్నా.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవేవీ అందుబాటులో ఉండటం లేదని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణగా చెప్పొచ్చు. రహదారి సదుపాయం లేకపోవడం, దగ్గర్లో వైద్య సదుపాయం లేకపోవడంతో.. ప్రసవ మరణాలు ఏజెన్సీలో ఇప్పటికీ సాధారణం కావడం బాధాకరం.


By August 25, 2019 at 04:25PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/visakhapatnam-agency-pregnant-woman-walks-20-km-for-medical-treatment-both-mom-and-baby-dies/articleshow/70827859.cms

No comments