Breaking News

మరో మహిళతో సహజీవనం.. భర్త, ప్రియురాలిని చెప్పుతో కొట్టిన భార్య


కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను వదిలేసి వెళ్లిపోయిన మరో మహిళను సహజీవనం చేస్తున్నాడో వ్యక్తి. భర్త సాగిస్తున్న గురించి తెలుసుకున్న భార్య అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పుతో కొట్టింది. తన సంసారాన్ని నాశనం చేసిన మహిళను చితకబాదింది. ఈ ఘటన కూకట్‌పల్లిలో గురువారం జరిగింది. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు, సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడుఉన్నాడు. పెళ్లి తర్వాత లక్ష్మణ్‌కు కరీంనగర్ జిల్లా వెంకట్రావుపేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. అనూషకు 2013లో రవికాంత్ అనే వ్యక్తి పెళ్లయి ఓ బాబు ఉన్నాడు. ఇద్దరూ వివాహితులే అయినప్పటికీ పరిచయం కాస్తా ప్రేమగా మారి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కొద్దికాలం తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్న లక్ష్మణ్, అనూష్ తమ కుటుంబాలను వదిలేసి పారిపోయారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. తన భర్త అక్రమ సంబంధంపై అనేక ఆధారాలు సేకరించిన లక్ష్మణ్ భార్య సౌజన్య వాటిని పెద్ద మనుషుల్లో పెట్టింది. అయితే ఆ ఫోటోలు పాతవని, అనూష ప్రస్తుతం తన దగ్గర లేదని, భార్యతో ఉండలేకే తాను ఒంటరిగా హైదరాబాద్‌లో ఉంటున్నానని లక్ష్మణ్ చెప్పాడు. పెద్ద మనుషులు లక్ష్మణ్‌కు నచ్చజెప్పి భార్యతో కలిసి ఉండాలని ఆదేశించారు. కొద్దిరోజుల పాటు భార్యతో సఖ్యతగానే ఉన్న లక్ష్మణ్ అనూషతో మళ్లీ వ్యవహారం మొదలుపెట్టాడు. గురువారం వీరిద్దరూ ఓ ఫ్లాట్‌లో ఏకాంతంగా ఉండగా సౌజన్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తను, అనూషను చెప్పుదెబ్బలు కొట్టి పోలీసులకు అప్పగించింది.


By July 26, 2019 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wife-caught-her-husband-red-handed-with-another-women-in-hyderabad/articleshow/70389721.cms

No comments