Breaking News

వేశ్య కోసం శత్రువులుగా మారిన ఫ్రెండ్స్.. హత్యకు దారితీసిన అఫైర్


సహజీవనం, ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. దుబాయిలో మొదలైన స్నేహం ఓ వేశ్య కోసం ఘర్షణ పడి ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. మొగల్తూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి కొన్నాళ్లు ఉండి వచ్చాడు. అతడితో పాటు అక్కడ పనిచేసిన దువ్వ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. స్వదేశానికి వచ్చిన తర్వాత శివరామకృష్ణకు వ్యభిచార వృత్తి కొనసాగిస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ఓ ఇంట్లో ఉంచి సహజీవనం కొనసాగిస్తున్నాడు. గల్ఫ్‌లో ఏర్పడిన పరిచయంతో శివరామకృష్ణ ఇంటికి బాలాజీ తరుచూ వస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ యువతితో బాలాజీకి అక్రమ సంబంధం ఏర్పడింది. శివరామకృష్ణ గ్రామంలో లేని సమయంలో యువతి, బాలాజీకి ఏకాంతంగా కలుసుకునేవారు. కొంతకాలం పాటు సాగిన వారి అక్రమ సంబంధం శివరామకృష్ణ తెలియడంతో ఆ యువతిని ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు పంపేశాడు. ఆమె అక్కడికి వెళ్లినా బాలాజీతో ఫోన్లో మాట్లాడేది. ఈ విషయం తెలుసుకున్న శివరామకృష్ణ బాలాజీని హెచ్చరించగా అతడు పట్టించుకోలేదు. దీంతో బాలాజీని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి మందు పార్టీ చేసుకుందామంటూ బాలాజీని ఆహ్వానించాడు శివరామకృష్ణ. వీరిద్దరూ దువ్వలోని ఓ వైన్‌షాపుకు వెళ్లి ఫుల్లుగా మద్యం తాగారు. తనతో సహజీవనం చేస్తున్న యువతిని మరిచిపోవాలని శివరామకృష్ణ బాలాజీని హెచ్చరించాడు. బాలాజీ ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో దుబాయ్‌ నుంచి ఆ యువతి బాలాజీకి ఫోన్ చేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శివరామకృష్ణ కత్తితో స్నేహితుడి పీక కోసి పరారయ్యాడు. తీవ్రరక్తస్రావంతో బాలాజీ వైన్‌షాప్ ఆవరణలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న తణుకు రూరల్ సీఐ చైతన్యకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించి శివరామకృష్ణను శనివారం అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 15రోజుల రిమాండ్ విధించింది. ఒక వేశ్య కోసం స్నేహితులు శత్రువులుగా మారిపోవడం, ఒకరి చేతిలో మరొకరు ప్రాణాలు కోల్పోవడం పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది.


By July 29, 2019 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-man-murdered-by-friend-due-to-illegal-affair/articleshow/70429803.cms

No comments