‘సూపర్ డీలక్స్’ని సామ్ తెలుగులో వద్దనుకుంటుందా?
అక్కినేని సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్. ఇందులో ఓ ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో కూడా నటించారు. ఇందులో రమ్యకృష్ణ , సమంత స్పైసీ పాత్రల్లో నటించడం విశేషం. తమిళంలో రిలీజ్ అయ్యి 6 నెలలు కావస్తున్నా.. ఇంకా తెలుగులో ఈ సినిమాని ఎవరు కొన్నారు అనేదే తెలియదు.
తమిళ సినిమాలు ఏమాత్రం బాగున్నా అవి ఈజీగా తెలుగులోకి డబ్ అవుతాయి కానీ ఈ సినిమా ఎందుకో డబ్ కావడంలేదు. కానీ ఈ సినిమా తెలుగులోకి రావడానికి సమంత అంత సుముఖంగా లేదని మాత్రం గాసిప్‌లు వినిపిస్తున్నాయిు. కారణం ఇందులో సామ్ సినిమా స్టార్టింగ్‌లోనే తన మాజీ ప్రియుడితో సెక్స్ లో పాల్గొనడంతో ప్రారంభమవుతుంది. అటువంటివి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అంతగా నచ్చదు అని భావించి పెద్దగా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపట్లేదట.
అలానే సినిమాలో రమ్యకృష్ణ వేశ్యగా కనిపిస్తుంది. పెళ్లయినా తరువాత మంచి పాత్రలు ఎంచుకుని మరీ నటిస్తున్న సమంత సూపర్ డీలక్స్‌లో తన పాత్ర వీటికి భిన్నంగా వుంటుంది కనుక తెలుగులోకి రావడానికి ఆమె అంతగా ఇష్టపడడంలేదని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.
By July 30, 2019 at 04:42AM
No comments