కడప: పొలంలో పనిచేస్తుండగా పేలిన నాటు బాంబులు..

కడప జిల్లాలో కలకలం సృష్టించింది. పొలం పనులు చేస్తుండగా అప్పటికే భూమిలో పాతి ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిధిలోని మైలవరం మండలం రామచంద్రాయపల్లి గ్రామంలో గురువారం (జులై 11) ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేయిస్తుండగా.. ఓ బకెట్ వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న యువకుడు సోమశేఖర్.. ఆ బకెట్లో ఏముందని పరిశీలించే లోగా.. అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన సోమశేఖర్‌ను కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాటు బాంబులను అక్కడ ఎవరు పాతిపెట్టారు? దీని వెనుక ఏ కుట్ర కోణం ఉందనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
By July 11, 2019 at 01:56PM
No comments