Breaking News

Agra: మురికి కాలువలో పడిన బస్సు.. 29మంది మృతి


ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి 50 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌‌కు చెందిన బస్సు సమీపంలో అదుపుతప్పి వంతెన పైనుంచి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 29 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.


By July 08, 2019 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-bus-falls-into-drain-on-yamuna-expressway-29-dead/articleshow/70121790.cms

No comments