Breaking News

‘రంగ్ దే!’.. అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్


‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తరవాత కాస్త ఎక్కువగానే విరామం తీసుకున్న హీరో ఇప్పుడు వరసపెట్టి సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వెంకీ కుడుములతో ‘భీష్మ’ చిత్రంతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన నితిన్.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తు్న్నారు. ఈ సినిమాకు ‘రంగ్ దే!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ‘రంగ్ దే!’ నితిన్‌కు 29వ సినిమా. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాను ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది నితిన్ ప్రకటించిన మూడో సినిమా ఇది. వాస్తవానికి ఆదివారమే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంతో తన 28వ సినిమాను నితిన్ ప్రారంభించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాను ప్రకటించి 24 గంటలు కాకముందే మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘భీష్మ’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాత బహుశా ‘రంగ్ దే!’ రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చు. కాగా, ఈ సినిమాకు సంగీతం దర్శకుడిని ఇంకా ఖరారు చేయలేదు.


By June 24, 2019 at 11:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithiin-announces-his-29th-film-with-venky-atluri-titled-as-rang-de/articleshow/69923388.cms

No comments