Breaking News

55ఏళ్ల కామాంధుడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం


ఆరేళ్ల బాలికపై ఓ వృద్ధ కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో గురువారం జరిగింది. జగద్గిరిగుట్టలోని ఓ బస్తీలో పేద దంపతులు కుమార్తె(6)తో కలిసి జీవిస్తున్నారు. వారు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తుండగా బాలిక ఇంటి వద్దనే ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికపై కన్నేసిన అదే బస్తీకి చెందిన ఎల్లయ్య (55) గురువారం సాయంత్రం బాలికకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. దుస్తులు ఇప్పిన ఎల్లయ్య ఆమెపై లైంగిక దాడికి యత్నిస్తుండగా భయపడిన బాలిక గట్టిగా కేకలు పెట్టింది. దీంతో స్థానికులు ఏమైందా అని ఇళ్లల్లో నుంచి బయటకు రాగా ఎల్లయ్య ఇంటి నుంచి బాలిక పరుగులు తీయడం కనిపించింది. స్థానికులు ఏమైందని ప్రశ్నించగా ఎల్లయ్య నిర్వాకం గురించి చెప్పింది. దీంతో వారంతా అతడి ఇంటిని చుట్టుముట్టారు. అయితే అప్పటికే ఆ కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు కూలి పనుల నుంచి వచ్చాక విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణలో ఇటీవల బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. మూడు రోజుల క్రితం హన్మకొండలో 9నెలల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి చంపేసిప ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే సాక్షాత్తూ రాజధాని నగరంలోనే మరో ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.


By June 22, 2019 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/old-man-attempts-rape-on-6-year-old-in-hyderabad/articleshow/69899491.cms

No comments