Breaking News

బన్నీ సినిమాకు సుకుమార్‌కున్న సమస్య ఇదే!


‘నా పేరు సూర్య’ తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో రెండు సినిమాలను చేయాలనీ డిసైడ్ అయ్యాడు బన్నీ. తన సినిమాల విషయంలో వేగం పెంచిన బన్నీ నెక్స్ట్ మూవీ సుకుమార్ తో చేయాలా? లేదా వేణు శ్రీరామ్ తో చేయాలనీ కాస్త డైలామాలో  పడ్డారంట.

ఒకపక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మరోపక్క సుకుమార్ స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టాడు బన్నీ. ఈమూవీ ఈనెల 11 న లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.  అయితే ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో మాత్రం ఇప్పుడే చెప్పలేని ప‌రిస్థితి. ఎందుకంటే… సుకుమార్ సినిమా కోసం బ‌న్నీ గెట‌ప్ మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందులో బన్నీ గడ్డంతో కనిపించనున్నాడు. సో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయ్యాకే సుకుమార్ తో చేయాల్సి వస్తుంది బన్నీ. సుకుమార్ కి కూడా స్క్రిప్ట్ విషయంలో ఇంకా టైం పట్టేలా ఉంది. సుక్కు సెకండాఫ్ విష‌యంలో ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతూనే ఉన్నాడు.

అయితే వేణు శ్రీరామ్ మాత్రం ఐకాన్ స్క్రిప్ట్ ఫుల్ రెడీ ఉందని మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు మొత్తం రెడీగా ఉందని సో త్రివిక్రమ్ సినిమా చేస్తూ… ఐకాన్ పూర్తి చేసే ఛాన్సులు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. ఇదే జరిగితే సుక్కు సినిమా కంటే ముందు ఐకాన్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. కానీ సుక్కు, వేణు శ్రీరామ్ పూర్తి నరేషన్ ఇచ్చేలోపు సుక్కు తన స్క్రిప్ట్ ని పూర్తిగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు. సో మరి వీరిద్దరిలో ఎవరు ముందు బన్నీని డైరెక్ట్ చేస్తారో చూడాలి.



By May 07, 2019 at 01:01PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45840/venu-sriram.html

No comments