Breaking News

ఈ భామ ఇప్పుడైనా బ్లాక్‌బస్టర్ కొడుతుందా?


హీరోయిన్ పూజాహెగ్డేకి ఇప్పటివరకు కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. పూజా నటించిన ముకుందా, ఒక లైలా కోసం, డీజే దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత అన్ని యావరేజ్ హిట్స్. బాలీవుడ్ లో అయితే డిజాస్టర్ హీరోయిన్ పూజా హెగ్డే. అయినా పూజా హెగ్డే లాక్కేలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలకు వేరే ఆప్షన్ లేక అందరూ పూజా గ్లామర్ చుట్టూనే తిరుగుతున్నారు. అమ్మడు ఎలాగూ అందాలు ఆరబోతకు అడ్డుచెప్పే రకం కాదు. అందుకే అమ్మడుకి అలా అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్డే  నటించిన మహర్షి మూవీ విడుదలకు సిద్దమయ్యింది. మహేష్ తో కలిసి నటించిన మహర్షి మీద బోల్డన్ని అంచనాలున్నాయి.

మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని పూజా హెగ్డే తహతహలాడుతుంది. ఈ సినిమాలో మహేష్ కి ఫ్రెండ్ గా లవర్ గా పూజా హెగ్డే కనిపిస్తుంది అనేది మహర్షి ట్రైలర్లో చూపించారు కానీ... ఆమె కేరెక్టర్ సినిమాలో ఎలా ఉంటుంది రివీల్ చెయ్యలేదు. ఇక పూజా హెగ్డే మరోసారి గ్లామర్ డాల్ అనేది మహర్షి ట్రైలర్ లో చూస్తే అన్పిస్తుంది. ఇక మహర్షి టీం మాత్రం సినిమామీద మంచి హోప్ పెట్టుకున్నారు. సినిమా సూపర్ హిట్ అని. మరి మహర్షి సినిమా సూపర్ హిట్ అయితే అందరికన్నా ఎక్కువగా ఆనందపడేది, కలిసొచ్చేది ఒక్క పూజా హెగ్డేకే. ఇక మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్నాళ్లు పూజా టాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం. హిట్ అయినా అవకపోయినా ప్రస్తుతం పూజా చేతిలో ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు ఉండనే ఉన్నాయి. 



By May 07, 2019 at 01:11PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45841/pooja-hegde.html

No comments