Breaking News

అనుకున్నట్లే ‘సీత’ వచ్చే డేట్ మారింది!


దర్శకుడు తేజ అంటే ఇండస్ట్రీలోని అందరకీ తెలుసు. ఆయన పట్టిన కుందేలుకు మూడేకాళ్లు. ఇక విషయానికి వస్తే పుష్కరకాలం హిట్‌ కొట్టలేకపోయిన తేజ మరలా రానా-దగ్గుబాటి సురేష్‌ల పుణ్యమా అని నేనేరాజు నేనే మంత్రి చిత్రంతో పెద్దహిట్‌ కొట్టాడు. బడ్జెట్‌ పరంగా చూసుకుంటే ఈ చిత్రం మంచి లాభాలు తీసుకుని వచ్చింది. ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, తనకు అచ్చి వచ్చిన, తానే పరిచయం చేసిన కాజల్‌తో కలిసి ‘సీత’ చిత్రం తీస్తున్నాడు. 

కానీ ఈ చిత్రం ప్యాచ్‌వర్క్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో ఏప్రిల్‌ 25 విడుదల తేదీని ఏకంగా మే 24కి పోస్ట్‌పోన్‌ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోఈ నెల 25న విడుదల చేయాలని భావించిన తేజ ఎట్టకేలకు తన పంతం కాస్త తగ్గించుకున్నాడు. ఇక మే9 న ‘మహర్షి’ ఉంది. దాని తర్వాత రెండు వారాలు గ్యాప్‌ తీసుకుని ‘సీత’ సోలోగా వస్తుంది. ఇక డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఎలాగూ జూన్‌ 14కి వెళ్లిపోయింది. దీంతో ‘సీత’కి మంచి డేటే దొరికిందని చెప్పాలి. 

ఇక ‘సీత’కి వచ్చిన పోటీ అంతా మే31న శర్వానంద్‌-సుధీర్‌వర్మ-కాజల్‌ల చిత్రం, తమిళ స్టార్‌ సూర్య నటిస్తున్న ‘ఎన్జీకే’, చియాన్‌ విక్రమ్‌ చిత్రం వంటివి మాత్రమే. కాగా ఇంతకాలం మాస్‌ ఇమేజ్‌పై ఇష్టపడి ఆ రూట్‌లోనే పయనించిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ప్రస్తుతం సీత తో డిఫరెంట్‌ పాత్రలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అర్ధమవుతోంది. ఇదే దారిలో నడిస్తే యంగ్‌ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ దిశగా తేజ ఆయనకు మొదటి వెరైటీ చిత్రం ద్వారా ఘనవిజయం అందిస్తాడని భావించాలి. 



By April 24, 2019 at 04:11PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45662/sai-srinivas.html

No comments