Breaking News

మహేష్‌తో కంటే ముందు లేడీ ఓరియంటెండ్‌!


దర్శకుని టాలెంట్‌ని గమనించాలంటే ఆయన తీసిన అన్ని చిత్రాలను చూసి బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఒక మెతుకును పట్టుకుంటేనే తెలిసిపోతుంది. ఈ విషయంలో నిర్మాత దిల్‌రాజు చాలా ముందు చూపుతో ఉంటాడు. అనిల్‌రావిపూడి, కళ్యాణ్‌రామ్‌తో తీసిని మొదటి చిత్రం పటాస్‌ ను దిల్‌రాజు విడుదల చేశాడు. ఈ చిత్రం పంపిణీదారునిగా దిల్‌రాజుకి మంచి లాభాలు అందించింది. వెంటనే అనిల్‌ని తన కాంపౌండ్‌లోకి తీసుకుని వచ్చాడు. సుప్రీం, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 వంటి బ్లాక్‌బస్టర్స్‌ని అనిల్‌రావిపూడి దిల్‌రాజుకి ఇచ్చాడు. 

ఇక ప్రస్తుతం మరో రెండు చిత్రాలకు కూడా అనిల్‌, దిల్‌రాజు కమిట్‌మెంట్‌ తీసుకుని ఉన్నాడు. మహేష్‌బాబు హీరోగా అనిల్‌సుంకరతో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు ఎఫ్‌2 కి సీక్వెల్‌గా ఎఫ్‌ 3 ని కూడా లైన్‌లో పెట్టాడు. ఇక ఎఫ్‌2 విడుదల అయిన తర్వాత పలువురు స్టార్స్‌ అనిల్‌పై దృష్టి సారించారు. కానీ మహేష్‌ మాత్రం ఎఫ్‌2 కంటే ముందే అనిల్‌లోని టాలెంట్‌ని గుర్తించాడు. అందుకే ఎఫ్‌2 చిత్రం షూటింగ్‌ సమయంలోనే అనిల్‌ని పిలిచి అతను చెప్పిన కథ నచ్చి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే ఇదంతా సీక్రెట్‌గా జరిగింది. అయితే అనిల్‌రావిపూడి ఎఫ్‌2 తర్వాత వెంటనే మహేష్‌తో 26వ ప్రతిష్టాత్మక చిత్రం కాకుండా దాని కంటే ముందే తక్కువ బడ్జెట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్‌ స్టోరీని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 

ఈ చిత్రం క్రీడానేపధ్యంలో గురు, అశ్వనీ వంటి చిత్రాల తరహాలో ఉంటుందని సమాచారం. ఈ సినిమా తర్వాతనే మహేష్‌ తనతో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. అంటే మహర్షి చిత్రం విడుదలైన వెంటనే అనిల్‌ చిత్రం పట్టాలెక్కలేదని తెలుస్తోంది. అయినా మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌ చాన్స్‌ ఇస్తే ఉన్న కొద్ది పాటి సమయంలో మహేష్‌ స్క్రిప్ట్‌కే బెటర్‌మెంట్‌లు చేయకుండా ఇలా మధ్యలో లేడీఓరియంటెడ్‌ చిత్రం తీయాలని అనిల్‌ భావించడం ఎంత వరకు సమంజసమో ఎదురు చూడాలి..! 



By April 24, 2019 at 04:04PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45661/anil-ravipudi.html

No comments