Breaking News

ఈ హైబ్రిడ్‌ భామ రూటే సపరేట్‌!


ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో సాయిపల్లవి, కీర్తిసురేష్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇద్దరు గ్లామర్‌ షోకి నో చెప్పడంతోపాటు ఎంత పెద్ద ఆఫర్‌ అయినా ఎంత పెద్ద స్టార్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా తమకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లేకపోతే భారీ రెమ్యూనరేషన్‌కి కూడా కాదని నో చెబుతారు. ఇక సాయిపల్లవి రూట్‌ మరింత సపరేట్‌. ‘ఫిదా’తో యువత హృదయాలను కొల్లగొట్టిన సాయిపల్లవి సినిమాలలో పెద్దగా మేకప్‌ లేకుండానే సహజసిద్దంగా నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమెకి మొహంలో మొటిమలు ఉంటాయి. కానీ ఆమె ఆ మొటిమలను కూడా మేకప్‌ ద్వారా కవర్‌ చేసుకోవాలనే ప్రయత్నం చేయదు. అదే తనకి స్పెషల్‌ అట్రాక్షన్‌గా భావిస్తూ ఉంటుంది. నిజంగానే ఆ మొటిమల వల్లనే ఆమెకి మన పక్కింటి అమ్మాయి అనే గుర్తింపు వచ్చింది. 

ఇక విషయానికి వస్తే తాజాగా ఆమె తనకు వచ్చిన ఓ భారీ యాడ్‌కి నో చెప్పిందట. ప్రముఖ కాస్మటిక్‌ కంపెనీ తాము లాంఛ్‌ చేస్తోన్న ఫేషియల్‌ క్రీమ్‌కి ఆమెని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయాలని కోరింది. షూటింగ్‌కి కేవలం రెండు రోజులు కేటాయిస్తే చాలు.. ఏకంగా రెండు కోట్ల పారితోషికం వస్తుంది. కానీ సాయిపల్లవి మాత్రం తన మనసుని చంపుకుని ఆ యాడ్‌లో నటించేందుకు ఒప్పుకోలేదు. సాయి పల్లవి సహజంగా తాను మేకప్‌ లేకుండా సహజసిద్దంగా సినిమాలలో నటించేందుకే ఇష్టపడుతుంది. అందుకే సినిమాలలో ఆమె మొహంపై మొటిమలు అలానే కనిపిస్తాయి. మరి తనే మేకప్‌ లేకుండా ఒరిజినల్‌గా సినిమాలలో నటించేటప్పుడు ఇలా ఫేస్‌ క్రీమ్‌ యాడ్‌లో నటించడం ఆమెకి నచ్చలేదు. 

ఈ విషయంలో ఆమె తన అంతరాత్మని చంపుకోలేదు. సాయిపల్లవి ఇదే కాదు.. ఇటీవల కూడా తన పంథా ఏమిటో చాటి చెప్పింది. నేటిరోజుల్లో ఏదైనా చిత్రం ఫ్లాప్‌ అయితే హీరో, దర్శకులు ముందుకు వచ్చి ఆయా నష్టాలను భర్తీ చేస్తూ ఉంటారు. కొందరు హీరోలు, దర్శకులైతే అది కూడా చేయరు. కానీ ఓ చిత్రం ఫ్లాప్‌ అయి నష్టాలు వస్తే అందులో నటించిన హీరోయిన్లు నష్టాలను పూడ్చడం అనేది జరిగే పని కాదు. కానీ ‘పడి పడి లేచె మనసు’ చిత్రం ఫ్లాప్‌ కావడంతో సాయిపల్లవి తనకు రావాల్సిన పెండింగ్‌ రెమ్యూనరేషన్‌ని తీసుకోకుండా నిర్మాతలకే ఇచ్చి నస్టాలను పూడ్చమని చెప్పడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. 



By April 18, 2019 at 04:30AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45571/sai-pallavi.html

No comments