Breaking News

చంద్రబాబుని గట్టిగా ఇరికించేశాడు..!


రాజకీయాలలో నారా చంద్రబాబునాయుడుని చాణక్యుడు అంటారు. కానీ అలాంటి చాణక్యుడే కేసీఆర్‌కి మంత్రిపదవి ఇవ్వకపోయే సరికి ప్రత్యేక తెలంగాణ రాగం అందుకుని ఇప్పుడు చంద్రబాబుకే పక్కలో బల్లెంలా మారాడు. ఇక నెల్లూరు జిల్లాకి చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి చేతుల్లో కూడా బాబు మోసపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. చంద్రబాబు ఆయనకు నెల్లూరు రూరల్‌ టిక్కెట్‌ ఇచ్చే వరకు చంద్రబాబు పక్కనే ఉండి, అమరావతిలో మకాం వేసి కాంట్రాక్ట్‌ పనుల్లో తనకి రావాల్సిన 50కోట్లు దాకా మంజూరు చేయించుకుని హఠాత్తుగా వైసీపీలో చేరాడు. 

ఇక విషయానికి వస్తే చంద్రబాబు చాణక్యుడు అయితే తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడని మన పెద్దలు చెప్పిన సామెత వివాదాస్పద దర్శకుడు వర్మకి వర్తిస్తుంది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో ఆయన చంద్రబాబునాయుడుకి పగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఇది చంద్రబాబుకి నందమూరి కుటుంబాలకు వ్యతిరేక చిత్రమని, లక్ష్వీపార్వతికి అనుకూలంగా, ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్‌కావడం, ఆమె ఎదుర్కొన్నఅవమానాలు, ఎన్టీఆర్‌ వెన్నుపోటు, అందులో నారా చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యుల పాత్రలు, జీవిత చరమాంకంలో ఎన్టీఆర్‌ అనుభవించిన దుస్థితి వంటివి చూపనున్నాడు. దాంతో ఈ చిత్రాన్ని ఆపివేయాలని సెన్సార్‌ వారికి టిడిపి వారు కోరితే అది తమ పరిధిలోకి రాదని వారు తేల్చిచెప్పారు. కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. ఆ కేసులు మొత్తాన్నికోర్టు కొట్టివేసింది. దాంతో ఈ చిత్రం ఈనెల 29న రావడం ఖాయమంటున్నారు. 

ఇక ఈసారి వర్మ ఎంతో తెలివిగా చంద్రబాబుని లాక్‌ చేయడం చర్చనీయాంశం అయింది. ఈ సినిమా రిలీజ్‌పై ట్విట్టర్‌లో స్పందించిన వర్మ మాట్లాడుతూ, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో దానికి ఆస్కారం లేదు. ఆయనే పక్కనుండి సినిమా రిలీజ్‌ అయ్యేలా చూస్తారు.. అంటూ చివర్లో జై చంద్రబాబు అని నినాదం కూడా చేశాడు. ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు ఇరుకున పడినట్లే. చిత్రం విడుదలకు సహకరించకపోతే ఆయన కావాలని సినిమా రిలీజ్‌ని అడ్డుకున్నాడని, విడుదల చేస్తే తననే విలన్‌గా చూపించిన చిత్రం ద్వారా లేని పోని తలనొప్పులు వస్తాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది....! 



By March 23, 2019 at 11:00AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45256/ram-gopal-varma.html

No comments