Breaking News

అప్పుడు ఎన్టీఆర్ కు, ఇప్పుడు యాత్రకు సేమ్ ప్రోబ్లమ్


జనవరి 9న భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి వచ్చిన రెస్పాన్స్, రివ్యూస్ చూసి ఇది మరో సంక్రాంతి విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. కట్ చేస్తే.. మొదటిరోజు సాయంత్రం షోస్ కూడా హౌస్ ఫుల్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత కలెక్షన్స్ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర కూడా సేమ్ ప్రోబ్లమ్ ఫేస్ చేస్తోంది. రివ్యూస్ బాగున్నాయి, టాక్ బాగుంది కానీ.. కలెక్షన్స్ చాలా నామమాత్రంగా ఉన్నాయి. కాకపోతే.. ఎన్టీఆర్ కథానాయకుడుతో కంపేర్ చేస్తే.. యాత్ర చిత్రాన్ని చాలా తక్కువ రేట్ కి అమ్మారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా నష్టపోయేది ఉండదు.. కుదిరితే లాభాలు రావచ్చు. 

అయితే.. ఇక్కడ లాభనష్టాలు అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. అసలు జనాల హృదయాల్లో చెరగని సంతకం చేసిన మహానేతల బయోపిక్స్ ను ఎందుకని జనాలు ఆదరించడం లేదు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ బయోపిక్స్ లో నిజాలు పక్కనపెట్టి.. డ్రామాకి పెద్ద పీట వేయడం అనేది మొదటి తప్పు కాగా.. సినిమా మొత్తంలో వారి జీవితంలో నెగిటివ్ లేదా చీకటి కోణాన్ని మాత్రం చూపడం లేదు. ఆ కారణంగా చరిత్ర తెలిసివారికి ఈ బయోపిక్స్ ఏదో పాజిటివ్ డాక్యుమెంటరీస్ లా కనిపిస్తుంటే.. చరిత్ర గురించి అవగాహన లేనివారికి మాత్రం బోర్ కొడుతుంది. ఆ కారణంగా సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉండడం లేదు.. మౌత్ టాక్ విన్నాక థియేటర్లకు వెళ్లాలన్న ఆసక్తి జనాలకు ఉండడం లేదు. దాంతో మాస్ సినిమాలతో పోల్చి చూస్తే.. ఈ బయోపిక్స్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతున్నాయి. మహానటి తరహాలో ఒక పూర్తిస్థాయి బయోపిక్ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. 



By February 11, 2019 at 01:12AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44667/yatra.html

No comments