Breaking News

బోయపాటికి ఈ చిత్రం అగ్నిపరీక్షే..!


బోయపాటి శ్రీను.. దిల్‌రాజు నిర్మాతగా రవితేజ హీరోగా ‘భద్ర’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యాడు. బి.గోపాల్‌, వి.వి.వినాయక్‌ల తర్వాత పూర్తిగా మాస్‌ పల్స్‌ తెలిసిన డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. ఇక ఈయన చిత్రాలలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌తో చేసిన ‘దమ్ము’ డిజాస్టర్‌ అయింది. అయినా ఆయనపై ఆ ఎఫెక్ట్‌ మాత్రం పడలేదు. ‘జయ జానకి నాయకా’ చిత్రం ద్వారా కూడా ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ వంటి యంగ్‌ హీరోని తెరపై చూపిన విధానం బాగుంది. ఇక పక్కా మాస్‌ కథతో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం నెగటివ్‌ టాక్‌ మధ్య కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బోయపాటితో చిత్రం చేయాలని ఉందని ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవే అన్నాడు. 

దానికి తగ్గట్లుగానే ‘సరైనోడు’ తర్వాత బోయపాటి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఓ చిత్రం చేయడానికి అల్లుఅరవింద్‌ ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఇది చిరు 152వ చిత్రం అవుతుందని అందరు భావించారు. కానీ చిరు తన 152వ చిత్రాన్ని కొరటాల శివతో కమిట్‌ అయ్యాడు. ఇక బోయపాటికి మరోసారి మెగా కాంపౌండ్‌ నుంచి మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో చిత్రం చేయాలని పిలుపువచ్చింది. అదే ‘వినయ విధేయ రామ’. నిర్మాత దానయ్యే అయినా బోయపాటి ఎంపిక మాత్రం మెగా కాంపౌండే చేసింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌ కావడంతో చరణ్‌ మీద కన్నా ఎక్కువగా బోయపాటిపై ఆ ఎఫెక్ట్‌ పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్‌ చిరంజీవి బోయపాటికి చాన్స్‌ ఇస్తాడా? అనేది అనుమానంగా మారింది. 

ఇక మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత అంతటి ఫాలోయంగ్‌ ఉన్న మాస్‌ స్టార్‌ నందమూరి నటసింహం బాలకృష్ణతో ఇప్పటికే బోయపాటి ‘సింహా, లెజెండ్‌’ వంటి చిత్రాలు తీశాడు. సాధారణంగా జయాపజయాలను పట్టించుకోని బాలయ్య.. బోయపాటితో హ్యాట్రిక్‌ చిత్రం ఖాయమైంది. ఈ చిత్రంతో భారీ హిట్‌ని కొట్టి ‘వినయ విధేయ రామ’ని మరిపించగలిగితే మరోసారి బోయపాటికి మెగా కాంపౌండ్‌లో అవకాశం లభిస్తుందేమో కానీ.. ప్రస్తుతానికైతే ఆయనకి మెగా డోర్స్ క్లోజ్ అయినట్లే కనిపిస్తున్నాయి. కాబట్టి బాలయ్యకు ఎన్టీఆర్‌ బయోపిక్‌ తర్వాత, బోయపాటికి ‘వినయ విధేయ రామ’ తదుపరి చేయబోయే చిత్రమే కీలకంగా మారనుంది. మరి తనపై నమ్మకం ఉంచిన బాలకృష్ణకు బోయపాటి ఏ స్థాయి హిట్‌ ఇస్తాడు? అనేది మాత్రం ఎదురుచూడాల్సిందే. మొత్తానికి బోయపాటికి బాలయ్య చిత్రం అగ్నిపరీక్షేనని చెప్పాలి. 



By February 10, 2019 at 05:30AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44654/balakrishna.html

No comments