సందీప్‌తో సుబ్రహ్మణ్యపురం దర్శకుడు
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
సుబ్రహ్మణ్యపురం చిత్రంతో దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్న సంతోష్ జాగర్లపూడి దర్శకతంలో యువ హీరో సందీప్‌కిషన్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. సుబ్రహ్మణ్యపురం చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా పేరుపొందిన బీరం సుధాకర్ రెడ్డి, కార్తీకేయ చిత్రంతో నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్‌లు సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ అండ్ టారస్ సినీ కార్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. క్రీడా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అత్యంత ప్రాచీనమైన ధనుర్విధ్యలో ప్రధాన ఆకర్షణ లక్ష్యాన్ని ఛేదించడం. అత్యంత కష్టమైన ఈ విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది చిత్ర కథ. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు.
By February 21, 2019 at 02:46PM
No comments