ఫ్యాన్స్ హగామా మామూలుగా లేదుగా!
స్టార్ హీరో సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండదు. తమ హీరో కోసం కొత్త కసరత్తులు మొదలుపెట్టేస్తారు. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఫ్యాన్స్ హంగామా కొత్త పుంతలు తొక్కేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ హంగామా మరింత పీక్స్‌కి చేరుకుంది. ప్రిన్స్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `మహార్షి` వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేస్ అమెరికా నుంచి వచ్చి ఇండియాలో రైతులకు అండగా నిలబడే ఆధునిక యువకుడిగా కనిపించబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆ మధ్య చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవల ఇదే చిత్రానికి సంబంధించిన మరో లుక్‌ను కూడా న్యూఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఈ రెండు స్టిల్స్‌ని ఏకం చేస్తూ ఓ అభిమాని చేసిన కొత్త స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైభాగం పక్కా ఫారిన్ బాబులా సూటూ బూటూ వేసుకుని పాష్ లుక్‌తో మహేష్ కనిపిస్తున్నారు.
క్రింది భాగంలో మాత్రం తొలుత మహేష్ పుట్టిన రోజున విడుదల చేసిన లుక్‌ని వాడారు. ఇది సినిమాలో మహేష్ కనిపించబోయే పాత్రల తీరును చెప్పేస్తూ వుండటం నెటిజన్‌లను అమితంగా ఆకట్టుకుంటోంది. భారీ హంగులతో అత్యంత ప్రతిష్టాత్మరంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. రిలీజ్‌కు రెండు నెలల ముందే ఫ్యాన్స్ హంగామా ఈ రేంజ్‌లో వుంటే `మహర్షి` విడుదల సమయానికి ఇంకా ఏ స్థాయిలో వుంటుందో.
By January 04, 2019 at 03:48PM
No comments