Breaking News

‘సైరా’, ‘సాహో’.. అభిమానుల్లో నిరాశ!


న్యూ ఇయర్‌కి టాలీవుడ్ సినిమాల హడావిడి పీక్స్ లో కనబడింది.  షూటింగ్ జరుపుకునే సినిమాల దగ్గరనుండి.. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల వరకు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.... తమ సినిమాల పోస్టర్స్ తో హడావిడి చేశాయి. సంక్రాంతికి విడుదల కాబోయే పెద్ద చిత్రాలైతే పోస్టర్స్ మీద పోస్టర్స్ వదులుతూ సినిమాల మీద భారీ క్రేజ్ సంపాదించాయి. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రెండు సినిమాల చిత్ర బృందాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వదిలిన న్యూ ఇయర్ పోస్టర్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. ఆ సినిమాల మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఏప్రిల్ లో ఎప్పుడో విడుదల కాబోయే మహేష్ మహర్షి చిత్ర బృందం కూడా న్యూ ఇయర్ స్పెషల్ గా మహర్షి సెకండ్ లుక్‌ని విడుదల చేసింది.

కానీ టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ చరిత్ర సృష్టించడానికి సన్నద్ధం అవుతున్న సాహో, సై రా నరసింహరెడ్డి‌ల హడావిడి మాత్రం ఎక్కడా కనబడలేదు. ప్రభాస్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న సాహో చిత్రం ఆగష్టు 15 న విడుదలకు డేట్ కూడా లాక్ చేశారు. కానీ ఆ సినిమాకి సంబందించిన న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ ఎక్కడా కనబడలేదు. దానితో ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పలేదు. సాహో సుదీర్ఘ ప్రయాణంలో మరీ బిజీగా ఉందేమో చిత్ర బృందం. అందుకే ఒక్క పోస్టర్ కూడా రెడీ చెయ్యలేకపోయారంటున్నారు అభిమానులు. ఇక చిరంజీవి - సురేందర్ రెడ్డిల సై రా లుక్ కూడా ఈ న్యూ ఇయర్ లో ఎక్కడా కనబడలేదు.

మరి రామ్ చరణ్ వినయ విధేయ రామ న్యూ ఇయర్ లుక్స్ తో పండగ చేసుకున్న మెగా ఫ్యాన్స్.. సై రా లుక్ కూడా వస్తే బావుండేదనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి, చిరు లు సైలెంట్ గా ఉన్నారు. మరి ఈ న్యూ ఇయర్ కి సై రా లుక్ వదిలితే బావుండేది... మెగా ఫ్యాన్స్ ఖుష్ అయ్యేవారు. కానీ ప్రస్తుతం షూటింగ్ మీదే ఫోకస్ పెట్టిన సై రా బృందం న్యూ ఇయర్ పోస్టర్ పై శ్రద్ద పెట్టినట్లుగా కనబడలేదు. అందుకే న్యూ ఇయర్ కి రామ్ చరణ్ లుక్ తోనే మెగాఫ్యాన్స్ సర్దుకుపోయారు. మరి భారీ బడ్జెట్ చిత్రాలైన సాహో, సై రా లుక్స్ కూడా వదిలితే సినిమాల మీద మరింత క్రేజ్ ఏర్పడేది. 



By January 03, 2019 at 08:45AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44140/sye-raa.html

No comments