Breaking News

అర్జున్ రెడ్డి, టెంపర్.. ఇప్పుడు ‘గీత గోవిందం’!


తెలుగులో సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు పర భాషల్లో అంటే తమిళం, బాలీవుడ్ లలో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు హీరోలు. తమిళ, హిందీ స్టార్ హీరోలు కూడా తెలుగు సూపర్ హిట్స్ పై కన్నేసి ఉంచుతున్నారు. తమకి సెట్ అయ్యే సినిమాలను భారీ బడ్జెట్ లతో రీమేక్ చేసేస్తున్నారు. అలా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం తమిళంలో ధృవ్ హీరోగా రీమేక్ అవుతుంటే... బాలీవుడ్ షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. దీనిని ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ వంగానే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ - పూరి హిట్ చిత్రమైన టెంపర్ ని తమిళనాట విశాల్ రీమేక్ చేస్తుంటే... బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ రీమేక్ చెయ్యడం పెద్ద హిట్ అందుకోవడం జరిగాయి.

ఇక తాజాగా తెలుగులో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం 2018 బ్లాక్ బస్టర్ హిట్‌తో పెను సంచలనాన్ని సృష్టించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరిన చిన్న చిత్రంగా రికార్డులు సృష్టించింది. విజయ్ దేవరకొండకి.. అర్జున్ రెడ్డి ఇమేజ్ క్రేజ్ గీత గోవిందం హిట్ తో మరింతగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ చిత్రంపై బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్‌గా తెరకెక్కిన గీత గోవిందం బాలీవుడ్‌లో రీమేక్ కి రెడీ అయ్యింది.

మరి లో బడ్జెట్‌తో 100 కోట్లు కొల్లగొట్టిన ఈసినిమాని బాలీవుడ్ లో ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు కానీ... గోవిందుగా అదేనండి విజయ్ దేవరకొండ పోషించిన రోల్ మాత్రం ఇషాన్ కట్టర్ ని వరించిందని మాత్రం తెలుస్తుంది. గత ఏడాది ధఢక్ సినిమాతో మెప్పించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తెలుగు గీత గోవిందం రీమేక్ లో గోవిందుడుగా నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఇషాన్ హీరో అయితే ఆ సినిమాని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరో.. అలాగే నిర్మించే నిర్మాత ఎవరో అనేది క్లారిటీ రావాల్సిఉంది. 



By January 04, 2019 at 08:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44155/vijay-deverakonda.html

No comments