పాజిటివ్ టాక్ వస్తే చాలు ‘పేట’ కుమ్ముడే!!
నిజం చెప్పాలంటే నాలుగేళ్ల కిందట రజనీకి తెలుగులో ఉన్న మార్కెట్ మన సొంత స్టార్స్‌తో సమానంగా ఉండేది. ‘బాషా’తో పునరాగమనం చేసిన ఆయనకు ఆ తర్వాత వెనక్కుతిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ‘ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి’.. మరీ ముఖ్యంగా ‘శివాజీ, రోబో’ల సమయంలో ఆయన మార్కెట్ తెలుగులో పీక్స్‌లో ఉండేది. దాదాపు 40కోట్లకు అటు ఇటుగా ‘రోబో’ హక్కులు అమ్ముడుపోయాయంటే పరిస్థితి అర్ధం అవుతుంది. అయినా ఇంత బడ్జెట్‌ని కేటాయించి తెలుగులో రైట్స్ కొన్నా కూడా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలే వచ్చాయి. టిక్కెట్ల కోసం తెలుగు ప్రేక్షకులు తెగ ఆరాటపడేవారు. కానీ అక్కడి నుంచే రజనీకి బ్యాడ్‌కెరీర్ ప్రారంభమైంది.
అద్భుతమైన టెక్నాలజీ అంటూ ఆయన కూతురు సౌందర్య దర్శకత్వంలో నటించిన ‘కొచ్చాడయాన్’.. తెలుగులో ‘విక్రమసింహా’గా వచ్చి ఓ కార్టూన్‌ఫిల్మ్ అనే చెడ్డపేరు తెచ్చుకుంది. అయినా కూడా ‘లింగా’ హక్కులు 30కోట్లకు పైగానే అమ్ముడుపోయాయి. కానీ ఇది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటికీ రజనీ మేనియా తగ్గలేదు. పా రంజిత్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘కబాలి’ చిత్రంలో ఆయన లుక్స్, మాఫియా డాన్‌గా ‘బాషా’ స్థాయిలో ఉంటుందని చెప్పి దానిని కూడా తెలుగులో 30కోట్లకు కొన్నారు. దాంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
‘కాలా’ విషయానికి వస్తే తెలుగు నిర్మాతలు ఎవ్వరూ కొనకపోయేసరికి నిర్మాతలే సొంతంగా విడుదల చేసినా, 10కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. ఇక ‘2.ఓ’ సంగతి పక్కన పెట్టాలి. ఎందుకంటే అది ప్రత్యేక చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘పేట’ చిత్రం హక్కులు కూడా కేవలం 12కోట్లకు అటు ఇటుగా మాత్రమే పలికాయట. ఇక ‘పేట’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో రజనీ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఆయన స్టైల్ మేనరిజమ్స్, డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.
అచ్చమైన పంచెకట్టు,బుర్ర మీసాలతో చివరలో రజనీ వేసిన స్టెప్ అదిరిపోయిందనే చెప్పాలి. స్టైల్‌గా ఉన్నాను.. నేచురల్లీ.. అందమైన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఇకపై చూస్తావ్.. నిజం చెబుతున్నా.. అండర్‌వేర్‌తో పరుగెత్తిస్తా.. పరువు పోతే రాదు చూస్కో.. వంటి డైలాగ్స్ జనరంజకంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడుతున్నాయి.
మరి రంజిత్ పా చేసిన తప్పులను మరో యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ చేయడనే భావించాలి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం కుమ్మేయడం గ్యారంటీ అంటున్నారు.
By January 04, 2019 at 08:43AM
No comments