Breaking News

‘వినయ విధేయ రాముడు’ రూట్‌ మార్చాడు!


మొదటి నుంచి అనుకుంటున్నదే జరిగింది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ అదరగొడుతోంది. ఊరమాస్‌తో కూడిన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ చిత్రం అనే సరికి బోయపాటి స్టైల్‌లోనే పవర్‌ఫుల్‌ హీరోయిజం ఇందులో ఉంటుందని అర్దమవుతోంది. అయితే బోయపాటి పవర్‌ఫుల్‌ యాక్షన మూవీస్‌ని తీస్తూనే అందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా రంగరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా చేయడంలో సిద్దహస్తుడు. గతంలో ‘భద్ర, సింహా, లెజెండ్‌, సరైనోడు’ ఇలా.. అన్ని చిత్రాలలో బోయపాటి అదే చేసి చూపించాడు.

ఇక తాజాగా ‘వినయ విధేయ రామ’కి సంబంధించిన వీడియో తాలూకు ప్రొమోలు విడుదల చేస్తున్నారు. ఇందులో మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. బహుశా ఇది ‘గ్యాంగ్‌లీడర్‌’ తరహాలో ఉండే కథ అని వార్తలు రావడానికి కారణం ఇదే అనిపిస్తోంది. చరణ్‌ ఫ్యామిలీ మీద వచ్చే ‘తందానే.. తందానే’ పాట వినడానికి పెద్దగా ఆకట్టుకోకపోయినా చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ మూవీలో చరణ్‌కి నలుగురు అన్నయ్యలు, వదినలు, వారి పిల్లలు ఉంటారని మొదటి నుంచి అంటున్నారు. 

వాటిని నిజం చేస్తూ ఈ వీడియో ప్రోమోలో జీన్స్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, రవివర్మ, మధునందన్‌లు నలుగురు అన్నయ్యలుగా కనిపిస్తున్నారు. అందరు ఎంతో ఆనందంగా జరుపుకునే వేడకలా ఇది ఉంది. ఇక తన ఫ్యామిలీకి భయంకరమైన వేరే ప్రాంతానికి చెందిన విలన్‌ వల్ల వచ్చిన కష్టాలు, తన కుటుంబం ఆ విలన్‌ వల్ల ఏర్పడిన బాధలకు ప్రతీకారం తీర్చుకుంటూనే కుటుంబానికి వినయ విధేయునిగా కనిపించే రాముడు ఇందులో కనిపిస్తుండటం విశేషం. 

రామాయణం, రావణుడు, రాముడు, లక్ష్మణుడు... ఈ తరహాలోనే ఇందులోని బంధాలు, అనుబంధాలు, కష్టాలు, ప్రతీకారాలు ఉంటాయని అర్ధమవుతోంది. ‘భరత్‌ అనే నేను’ తర్వాత కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఎలా మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది...! 



By January 04, 2019 at 09:06AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44157/ram-charan.html

No comments