ఇంకెప్పుడు మొదలెడతావ్ బాలయ్య..?
ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ డిజాస్టర్ నుంచి ఇంకా బాలయ్య బాబు కోలుకోలేదో లేక సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు ఎలాగూ ఫ్రీగా ఇచ్చేశామ్ కదా అనుకుంటున్నాడో తెలియదు కానీ.. ఫిబ్రవరి 14న విడుదల తేదీ ప్రకటించిన సెకండ్ పార్ట్ కి ఇప్పటివరకూ ప్రమోషన్స్ మొదలెట్టలేదు. రిలీజ్ కి సరిగ్గా 15 రోజులు ఉండగా.. కేవలం ఒక కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేయాలన్న ప్లాన్ తప్ప ప్రమోషన్ ప్లాన్ కానీ బడ్జెట్ కానీ నిర్మాతలు ఇప్పటివరకూ కేటాయించలేదు. ఒకపక్క డిస్ట్రిబ్యూటర్స్ తమకు ఈ సెకండ్ పార్ట్ ఫ్రీగానే వస్తున్నందుకు సంతోషిస్తున్నా.. ఇప్పటివరకూ ప్రమోషన్స్ లాంటివి మొదలెట్టాడకపోవడంతో.. ఫస్ట్ పార్ట్ కి ఆ రేంజ్ లో ప్రచారం చేస్తే జనాలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపలేదు. అలాంటిది సెకండ్ పార్ట్ కి ఇలా చేస్తే వస్తారా అని భయపడుతున్నారు.
మరో పక్క నిర్మాణంలో భాగస్వాములైన వారు కూడా సెకండ్ పార్ట్ తో కూడా ఈ తరహా నష్టాలే వస్తే కష్టమేనని భయపడుతున్నారు.
అందుకే.. బాలయ్య కూడా ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అనంతరం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఇమ్మీడియట్ గా బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలెట్టానున్నాడు. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న బోయపాటి సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టలేకపోయానన్న లోటును తీర్చుకోవాలనుకుంటున్నాడు బాలయ్య. మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. అలాగే.. ఎన్టీఆర్ కథానాయకుడు రిజల్ట్ తో సంబంధం లేకుండా.. మహానాయకుడు చిత్రాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా బాలయ్య మీద ఉంది. మరి ఎప్పటినుంచి ప్రమోషన్స్ మొదలెడతాడో చూడాలి.
By January 31, 2019 at 12:49AM
No comments