ఆర్.ఆర్.ఆర్ కి బాలీవుడ్ బ్యూటీల గోలేంటి..?
ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తాను తెరకెక్కించనున్న సినిమా కోసం రాజమౌళి అయినా ఇంత టెన్షన్ పడుతున్నాడో లేదో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం తెగ ఆరాటపడిపోతున్నారు. ఆల్రెడీ ఈ భారీ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా పరిణీతిని ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారని టాక్ నడుస్తుండగా.. ఇప్పుడు మరో హీరోయిన్ గా కూడా మరో బాలీవుడ్ భామను ఫైనల్ చేశారని వార్తలు మొదలయ్యాయి. ఆ బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు క్యూటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్.
రాజమౌళికి, ఆలియా భట్ కు మూట్యువల్ ఫ్రెండ్ అయిన నిర్మాత కరణ్ జోహార్ ద్వారా ఆర్.ఆర్.ఆర్ బృందం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇందులో మూడో కథానాయిక పాత్రకు కూడా అవకాశం ఉందని, ఆ పాత్ర కోసం కీయారా అద్వానీని అనుకొంటున్నట్లు వార్తలొస్తున్నారు. దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం రోజురోజుకీ స్టార్ వేల్యూ యాడ్ చేసుకుంటూనే ఉంది. అయితే.. త్వరగా రాజమౌళి ఈ హీరోయిన్ల విషయంలో కన్ఫ్యూజన్ పోగొట్టి ఎవరో ఒకర్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తే బాగుండు. అప్పుడు గానీ ఈ అనవసరమైన స్పెక్యులేషన్స్ కి తెరపడదు.
By January 31, 2019 at 12:47AM
No comments