ఫ్లాప్ హీరోకి లైఫ్ ఇస్తున్న దిల్ రాజు
అగ్ర నిర్మాత దిల్ రాజుకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే.. తన బ్యానర్ లో సినిమా తీసి ఫ్లాప్ కొట్టిన హీరోకి కానీ డైరెక్టర్ కి కానీ మరో సినిమాతో హిట్ ఇచ్చేవరకూ వదిలిపెట్టడు. తన బ్యానర్ లో నటించిన హీరోహీరోయిన్లు. దర్శకులు కనీసం మూడు సినిమాలు చేయాలని అగ్రిమెంట్ చేసుకొనే దిల్ రాజు.. తాజాగా తన బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా ప్రోడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆల్రెడీ దిల్ రాజు ఈ యంగ్ హీరోతో లవర్ అనే సినిమా తీసి డిజాస్టర్ అందుకున్నాడు. ఈ రిజల్ట్ ను తాను ముందే గెస్ చేశానని దిల్ రాజు స్వయంగా ప్రకటించుకోవడం కొసమెరుపు అనుకోండి.
సో, తన బ్యానర్ లో ఫ్లాప్ కొట్టిన హీరోకి హిట్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడో ఏమో కానీ రాజ్ తరుణ్ తో మరో ప్రొజెక్ట్ ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు దిల్ రాజు. ఆర్కే అనే యువ ప్రతిభాశాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిజానికి ఈ దర్శకుడి దర్శకత్వంలో మంత్రి జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఒక సినిమా మొదలెట్టాడు దిల్ రాజు. కారణాంతరాల వలన ఆ ప్రొజెక్ట్ ప్రారంభోత్సవంతోనే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు అదే స్క్రిప్ట్ ను రాజ్ తరుణ్ తో తెరకెక్కిస్తున్నాడు దిల్ రాజు.
ఈ ఏడాది ఆల్రెడీ "ఎఫ్ 2"తో సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు 2019ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మహేష్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుండగా.. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం అయిదు సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడట.
By January 31, 2019 at 12:51AM
No comments