Breaking News

‘రంగస్థలం’ కాదు.. ‘గీత గోవిందం’ చిత్రమే!


మరికొన్ని గంటల్లో 2018 సంవత్సరానికి బై బై చెప్పేసి 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి 2018 లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని అంటే రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే.. మరికొన్ని కాదు  కాదు చాలా డిజాస్టర్స్ అయ్యాయి. ఎంతో గొప్ప హిట్స్ అవుతాయనుకున్న సినిమాలు అడ్రెస్ లేకుండా పోయాయి. అయితే ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్ద బరిలోకి దిగిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడమే కాదు బాక్సాఫీసుని గడగడ లాడించాయి.

అయితే 2018 సంవత్సరానికి గాను మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడమే కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో ఉరకలు వేసాయి. అందులో భారీ బడ్జెట్ సినిమా అయిన రంగస్థలం, లో బడ్జెట్ మూవీ గీత గోవిందం, అలాగే మీడియం బడ్జెట్ మూవీ మహానటిలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ లిస్ట్ లో ముందున్నాయి. అయితే కలెక్షన్స్ వైజ్ గా రామ్ చరణ్ - సుకుమార్ ల  రంగస్దలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ... పెట్టిన పెట్టుబడిని …ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం కొలత వేస్తే విజయ్ దేవరకొండ - పరశురామ్‌ల గీతా గోవిందం చిత్రం మాత్రం సినిమా బ్లాక్ బస్టర్‌గా లెక్క తేలింది. 

అసలు విజయ్ దేవరకొండకి ఎంతగా క్రేజ్ ఉన్నప్పటికీ... గీత గోవిందం చిత్రం రిలీజ్ అయ్యాక వచ్చిన టాక్ చూసి పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్లు దాకా వస్తుందని అంచనా వేసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ… షేర్ 70 కోట్లు వచ్చింది. మరోపక్క బుల్లితెర మీద కూడా రంగస్థలం సినిమాతో గీత గోవిందం పోటా పోటీగా టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది. మరి దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది రంగస్థలం‌ని బ్లాక్ బస్టర్ హిట్ అంటామా... లేదంటే.. గీతా గోవిందాన్ని బ్లాక్ బస్టర్ హిట్ అంటారో.. అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 



By January 01, 2019 at 08:58AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44105/rangasthalam.html

No comments