మెగాపవర్: సైరా కోసం చిరు సాహసం!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో చిరంజీవి యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఈసినిమా కోసమే చిరు కసరత్తులు చేసి తన బాడీని సినిమాకు అనుగుణంగా ఫిట్‌గా మార్చుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్న చిరు.. సైరా కోసం మరో సాహసానికి రెడీ అయినట్టు సమాచారం.
ఇందులో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉందట. ఈ సీక్వెన్స్ కోసం చిరు రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. దీని కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ టీంను రప్పించారు. వీరితో పాటు ముంబయి నుంచి ఓ స్పెషల్ టీం ని కూడా రప్పించి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను రెడీ చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు నీటి లోపలే ఈ సీక్వెన్స్ తీర్చిదిద్దనున్నారట. ఎంతో కష్టంతో కూడుకున్న ఈ సీన్స్ కోసం చిరు కసరత్తులు చేస్తున్నారని సమాచారం.
63 ఏళ్ల వయసులో చిరు ఇటువంటి సాహసం చేయబోతుండటంతో ఫ్యాన్స్.. ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఇప్పుడు చిరుపై అభినందనల వర్షం కురుస్తోంది. త్వరలోనే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ కానుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. టాలీవుడ్ లో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఇది మొదటిసారి. చిన్నచిన్న ఫైట్స్ మినహాయిస్తే ఇదే మొదటిసారి.
By December 16, 2018 at 05:16AM
No comments