Breaking News

మరోసారి పవన్‌పై.. ‘కత్తి’ దూశాడు..!


సంచలనాలకు కేంద్రబిందువుగా మారడంలో రాంగోపాల్‌వర్మ వద్ద శిష్యరికం పుచ్చుకుని, వార్తల్లో ఉండటం ఎలా? అనే అంశంపై పిహెచ్‌డి చేసి డాక్టరేట్‌ పొందే లక్షణాలన్నీ కలిగిన సోకాల్డ్‌ క్రిటిక్‌ కత్తిమహేష్‌. ఈయన ఎవరి మీద అయినా ఇష్టం వచ్చినట్లు అవమానించేలా వ్యాఖ్యలు చేయవచ్చు గానీ అదే తనపై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం కోర్టు, పోలీస్‌స్టేషన్‌, దళిత కార్డుని బయటకు తీస్తాడు. ఇక పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేయడం ద్వారా ఈయన ఓ సెలబ్రిటీగా మారిపోయాడు. ‘పెసరట్టు’ చిత్రం తీయడానికి చేతగాని ఓ వ్యక్తి ఇతరులు సినిమాలు ఎలా తీయాలి? అనే విషయంలో విశ్లేషణలు ఇస్తూ ఉండటం మన దౌర్భాగ్యమేనని చెప్పాలి. అదేమంటే వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్ధిగా తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని అంటున్నాడు. ఇంతకీ ఈయనకు సీటు ఇచ్చే పార్టీ ఏదో మాత్రం అర్ధం కాదు. 

తాజాగా కత్తిమహేష్‌ మరోసారి పవన్‌కళ్యాణ్‌పై, జనసేనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్‌ వ్యతిరేకత, రాజకీయ శూనత్య, కమ్మకుల దురహంకారం, ఎన్టీఆర్‌ ఛరిష్మా ఇవన్నీ కలిపి పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక నేడు పవన్‌కళ్యాణ్‌ తెలివి శూన్యత, కొణిదెల బ్రదర్స్‌, ఫ్యామిలీపై ఉన్న అపనమ్మకం, కాపు కుల అనైక్యత, రాజకీయ సంవృద్ధి అంటే చంద్రబాబు, జగన్‌లు బరిలో ఉండటం.. ఇవన్నీ కలగలిపి పవన్‌ రాజకీయాలలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా జనసేన మూడు నుంచి 7సీట్లకు మించి గెలవదు. పవన్‌కళ్యాణ్‌ని నమ్ముకుంటే నష్టమే అని వామపక్షాలు గ్రహించాయి కాబోలు ఈ కుల సంఘం నాయకునికి దూరంగా, కాపుసేనకి దండం పెట్టి, జగన్‌ వైపు చేయి చాస్తున్నారని రూఢీగా తెలుస్తోంది.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

మరి కత్తిమహేష్‌ వ్యాఖ్యలను తప్పు అని నిరూపించుకోవడానికైనా కాపులలో ఐక్యత పెరుగుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు కాపుసేనకి, ఈ కుల నాయకుడికి వామపక్షాలు దూరంగా జరుగుతున్నాయని మహేష్‌ వ్యాఖ్యానించడం సరికాదని, ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్‌లు ‘కమ్మ’ యిస్టులుగా మారిపోయారనేది కత్తిమహేష్‌కి తెలియదా? ఇది ఆయన అజ్ఞానం అని వాదిస్తున్నారు. మరి కత్తి వ్యాఖ్యలకు జనసైనికులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది....! 



By November 21, 2018 at 07:45AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43578/kathi-mahesh.html

No comments