Breaking News

మెహ్రీన్ ఛాన్స్ బాలయ్య భామ కొట్టేసింది


క్యూట్‌గా బబ్లీగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్.. ‘‘చెప్పానా.. నేను చెప్పానా’’ అంటూ మొదటిసినిమాకే ఆకట్టుకుంది. కృష్ణగాడి వీర ప్రేమగాధ చూసిన ఎవ్వరైనా మెహ్రీన్ టాప్ హీరోయిన్ అవుతుందనే అనుకున్నారు. కానీ టాప్ స్టార్స్ తో మాత్రం మెహ్రీన్ కి కౌర్ కి అవకాశాలు రానే లేదు. మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న మెహ్రీన్ మధ్యలో అధిక బరువుతో అవకాశాలు కోల్పోయింది. తొలిప్రేమ లాంటి సినిమాలో మెహ్రీన్ అధిక బరువు కారణంగానే అవకాశం కోల్పోయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ తో కవచం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న మెహ్రీన్ కౌర్ టాలీవుడ్ టాప్ స్టార్ పక్కన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందనే టాక్ ఫిలిం నగర్ లో నడుస్తుంది.

మరి ఆ చేజారిన ఛాన్స్ అలాంటి ఇలాంటిది కాదండోయ్... ఏకంగా సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకుందట. అయితే ఈ అవకాశాన్ని మెహ్రీన్ కావాలనే చేజార్చుకుందంటున్నారు. మహేష్ తాజా చిత్రం మహర్షి లో మొదటగా సెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఆ ఆఫర్ వచ్చినప్పుడు మెహ్రీన్ ఎగిరి గంతేసినా... మహర్షి కోసం వంశీ పైడిపల్లి డేట్స్ అడిగినప్పుడు మాత్రం మెహ్రీన్ వేరే సినిమాల్తో బిజీగా ఉండి కుదరలేదట. అందుకే  మహేష్ బాబు పక్కన నటించే గోల్డెన్ ఆఫర్‌ని మెహ్రీన్ చేజార్చుకోవాల్సి వచ్చిందట. మరి మెహ్రీన్ వదులుకున్న ఆ గోల్డెన్ ఛాన్స్ ని బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహన్ తన్నుకుపోయింది.

మహర్షిలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే కాగా... ఇప్పుడు సెకండ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ అన్నమాట. మరి సోనాల్‌కి పెద్దగా టాలీవుడ్ లో హిట్స్ అయితే లేవు. కానీ మెహ్రీన్ వద్దనేసరికి వంశీకి సోనాల్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతోనే మహర్షి కోసం సోనాల్ ఎంపిక జరిగిందట.



By November 22, 2018 at 04:21AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43590/mehreen.html

No comments